Amrutharamam:ఓటీటీలో తొలి తెలుగు స్ట్రైట్ సినిమా ‘‘అమృతరామమ్’’..

జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫాంపై తొలి స్ట్రైట్ తెలుగు సినిమా.. ‘‘అమృతరామమ్’’..

Amrutharamam:ఓటీటీలో తొలి తెలుగు స్ట్రైట్ సినిమా ‘‘అమృతరామమ్’’..

Updated On : December 15, 2021 / 10:55 AM IST

Amrutharamam :5జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫాంపై తొలి స్ట్రైట్ తెలుగు సినిమా.. ‘‘అమృతరామమ్’’..

సరికొత్త ప్రేమ కథాంశంతో రూపొందిన రొమాంటిక్ చిత్రం ‘అమృతరామమ్’ ఈనెల 29న జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పై విడుదలవుతున్నట్లు చిత్ర నిర్మాత సి.ఎన్. రెడ్డి తెలిపారు. పద్మజ ఫిల్మ్స్ఇండియా ప్రై.లి., సినిమావాలా పతాకంలో నిర్మిచిన ఈ సినిమాను ఉగాది పర్వదినాన విడుదల చేయాలని సంకల్పించినా..కరోనా అనివార్య పరిస్థితులు తలెత్తడం.. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లు అమల్లోకి రావడంతో.. జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించినట్లు దర్శకుడు సురేందర్ కొంటాడ్డి తెలిపారు.

Amrutharamam

థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై వస్తున్న తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’ అని ఆయన అన్నారు. ఇప్పటిదాకా ప్రేమకథల్లో హీరోలే త్యాగాలు చేస్తున్నట్లుగా సినిమాలు వచ్చాయని… ఒకవేళ హీరోయిన్ పిచ్చిగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో అన్నదే ఈ సినిమాలో ప్రత్యేకార్షణ అని దర్శకులు వివరించారు. అమితా రంగనాథ్, రామ్ మిట్టకంటి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎన్.ఎస్. ప్రసు సంగీతం అందించగా, సంతోష్ షనోని డీఓపీగా వ్యవహరించారు. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

అన్ని పాటలు మ్యూజికల్ హిట్ అయ్యాయి. ఓ రకంగా ‘అమృతరామమ్’ సంగీత ప్రేమకథాచిత్రమనే చెప్పాలి. కరోనా విలయతాండవమాడుతున్న సమయంలో ప్రజలెవరూ బయటకు రావడానికి వీల్లేని పరిస్థితులు. థియేటర్లలో సినిమా విడుదల కావడం.. ప్రేక్షకులు రావడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రేక్షకులు అర్థం చేసుకుని సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. చక్కగా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో సినిమాను చూసి ఆనందిస్తారని అనుకుంటున్నామని చిత్ర బృందం వెల్లడించింది.

Amrutharamam