Gam Gam Ganesha Teaser : బేబీలో మిస్ అయినా ‘గం గం గణేశా’లో లిప్ కిస్ పెట్టేశాడు.. అన్నకు పోటీగా ఆనంద్ దేవరకొండ..
తాజాగా గం గం గణేశా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో ఎక్కడా సినిమా కథ రివీల్ అవ్వకుండా చూసుకున్నారు.

Anand Devarakonda Gam Gam Ganesha Movie Teaser Released
Gam Gam Ganesha Teaser : ఇటీవలే బేబీ సినిమాతో భారీ హిట్ కొట్టాడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అన్నయ్యలాగా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా మొదటి సినిమా ‘దొరసాని’ నుంచి కూడా కొత్త కొత్త కథలతో వస్తున్నాడు. ఇప్పుడు త్వరలో ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) సినిమాతో రాబోతున్నాడు ఆనంద్ దేవరకొండ.
హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో గం గం గణేశా సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో ఎక్కడా సినిమా కథ రివీల్ అవ్వకుండా చూసుకున్నారు. సినిమాలో ఫుల్ కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉండబోతుంది. తాజాగా రిలీజయిన గం గం గణేశా టీజర్ ట్రెండింగ్ లో ఉంది.
టీజర్ లో ఆనంద్ దేవరకొండకు, హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవతో లిప్ కిస్ సీన్ కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో లిప్ కిస్ లు ఉంటాయి. ఇటీవల వచ్చిన ఖుషి సినిమాలో కూడా సమంతతో లిప్ కిస్ ఉంది. తమ్ముడు కూడా మొదటి సినిమాలోనే లిప్ కిస్ పెట్టడంతో అన్నని ఫాలో అవుతాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ లిప్ కిస్ సీన్స్ చేయలేదు.
ఇటీవల వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ ఆనంద్ తో కాకుండా ఇంకో హీరోతో లిప్ కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. దీంతో ఆనంద్ దేవరకొండకి బేబీ సినిమాలో లిప్ కిస్ మిస్ అయిందని సరదాగా ట్రోల్స్ కూడా చేసారు. ఇప్పుడు బేబీ తర్వాత రాబోతున్న ఈ సినిమాలో లిప్ కిస్ ఉండటంతో బేబీలో మిస్ అయినా నెక్స్ట్ సినిమాలో ప్లాన్ చేశాడు కదా, అన్నని ఫాలో అవుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.