Abhishek Nama : డైరెక్టర్ పేరు తీసేసి తన పేరు వేసుకున్న నిర్మాత.. మొన్న విజయ్ దేవరకొండతో.. ఇప్పుడు డెవిల్ దర్శకుడితో వివాదం..

Abhishek Nama : డైరెక్టర్ పేరు తీసేసి తన పేరు వేసుకున్న నిర్మాత.. మొన్న విజయ్ దేవరకొండతో.. ఇప్పుడు డెవిల్ దర్శకుడితో వివాదం..

Abhishek Nama removed Director Naveen Medaram from Devil Movie and place his name as Director Issue goes viral in Tollywood

Updated On : September 15, 2023 / 5:53 PM IST

Abhishek Nama :  సినీ పరిశ్రమలో దర్శకులు, రచయితలు కష్టపడి రాసిన, తీసిన సినిమాలకు కొన్ని సార్లు ఎవరెవరో పేర్లు వేసుకుంటారని టాక్ వస్తుంది. నేనింతే(Neninthe) సినిమాలో రవితేజ(Raviteja) డైరెక్టర్ గా సినిమా తీస్తే డబ్బులు పెట్టిన విలన్ రవితేజ పేరు తీసేసి అతని పేరు వేసుకుంటాడు. తాజాగా ఇలాంటి సంఘటనే నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో జరిగింది.

నవీన్ మేడారం(Naveen Medaram) దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కుతున్న సినిమా డెవిల్(Devil). ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. స్వాతంత్య్రం కంటే ముందు జరిగిన సంఘటనలపై, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. డెవిల్ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ ని ప్రాజెక్టులోంచి పక్కకు తప్పించి నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ గా పేరు వేసుకోవడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది.

గతంలో డెవిల్ సినిమా దర్శకుడిగా నవీన్ మేడారంని ప్రకటించారు. గతంలో సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అన్నింటిపై అతని పేరే దర్శకుడిగా ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం. అయితే తాజాగా ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో, దానికి సంబంధించిన పోస్టర్స్ లో అభిషేక్ నామా పేరు డైరెక్టర్ గా ఉండటం గమనార్హం. దీంతో ఇది వివాదంగా మారింది. ఇక డైరెక్టర్ నవీన్ మేడారం తన ట్విట్టర్ లో తాజాగా.. వినాశకాలే విపరీత బుద్ధి అని ట్వీట్ చేశాడు. తనకి సపోర్ట్ గా కొంతమంది ట్విట్టర్ లో కామెంట్స్ కూడా అచేస్తున్నారు.

Abhishek Nama removed Director Naveen Medaram from Devil Movie and place his name as Director Issue goes viral in Tollywood

Devi Sri Prasad : లండన్‌లో దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ మ్యూజిక్ కాన్సర్ట్స్.. తెలుగు, తమిళ్‌లో..

మరి అభిషేక్ నామా ఎందుకు ఇలా చేశాడు? ఈ వివాదంపై స్పందిస్తాడా చూడాలి. ఇక ఈ సినిమాని నవంబర్ 24న రిలీజ్ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. మరి చెప్పిన టైంకి ఈ సినిమా రిలీజవుతుందా? డైరెక్టర్ గా ఎవరి పేరుతో రిలీజ్ అవుతుందో చూడాలి. ఈ సంఘటనతో అభిషేక్ నామాపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇటీవల విజయ్ దేవరకొండపై కూడా.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల 8 కోట్లు నష్టపోయాం, మమ్మల్ని కూడా ఆడుకో అంటూ సెటైరికల్ గా ఓ సంచలన ట్వీట్ చేసి వివాదంలో నిలిచాడు అభిషేక్ నామా. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా అభిషేక్ నామాపై విమర్శలు చేశారు. మొన్న విజయ్ దేవరకొండ వివాదం, ఇప్పుడు డైరెక్టర్ పేరు తీసేయడంపై వివాదం.. ఇలా అభిషేక్ నామా వార్తల్లో నిలుస్తున్నారు. మరి వీటిపై అయన డైరెక్ట్ గా స్పందిస్తాడేమో చూడాలి.