Devi Sri Prasad : లండన్‌లో దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ మ్యూజిక్ కాన్సర్ట్స్.. తెలుగు, తమిళ్‌లో..
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(DSP) లండన్(London) లో స్పెషల్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఇవ్వనున్నారు.

Devi Sri Prasad Music Concerts arranging in London for Sankranthi Event Organizing by RainbowSky
Devi Sri Prasad Music Concerts : ఇటీవల మన తెలుగు సంగీత దర్శకులు(Music Directors) కూడా మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు, అది కూడా విదేశాల్లో. కొన్ని రోజుల క్రితం అమెరికాలో థమన్(Thaman) మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహించగా మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(DSP) లండన్(London) లో స్పెషల్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఇవ్వనున్నారు. లండన్ లో ఉన్న తెలుగు వాళ్ళ కోసమే కాకుండా, తమిళ్ వాళ్ళ కోసం, అక్కడి వాళ్ళకి కూడా దేవిశ్రీ తన సంగీతాన్ని వినిపించబోతున్నాడు.
ఈ మ్యూజిక్ కాన్సర్ట్ ని దేవిశ్రీ సంక్రాంతికి ప్లాన్ చేశాడు. అంతే కాకుండా తెలుగు, తమిళ్ భాషల్లో సపరేట్ కాన్సర్ట్స్ ని ప్లాన్ చేశారు. జనవరి 13న తెలుగులో, 14న తమిళ్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సెర్ట్ లండన్ లో గ్రాండ్ గా జరగబోతుంది. దీంతో సంక్రాంతికి లండన్ లో గ్రాండ్ గా తెలుగు, తమిళ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ కాన్సర్ట్ ఈవెంట్ ని రెయిన్ బో స్కై అనే ఇంగ్లాండ్ కి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపనీ ఆర్గనైజ్ చేస్తుంది. అప్పుడే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. దీనిని దేవిశ్రీ అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటించాడు.
View this post on Instagram