Anand Deverakonda Talks Liger failure
Anand Deverakonda Talks Liger failure : హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజాగా నటిస్తున్న చిత్రం ‘బేజీ’. ‘కలర్ ఫోటో’ నిర్మాత సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చితబృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఆనంద్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన తన అన్నయ్య నటించిన ‘లైగర్’ చిత్ర పరాజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మామూలుగా విజయ్ వాయిస్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారని, ఆయన చెప్పే డైలాగులు అంటే కొందరు పడి చస్తారని చెప్పుకొచ్చాడు. అయితే లైగర్ సినిమాలో ఆయన నత్తి ఉన్న పాత్రను చేశాడు. ఇదీ చాలా మందికి నచ్చలేదు. సినిమా పరాజయానికి ఇదీ కూడా ఓ కారణం కావొచ్చునని చెప్పారు.
ప్రాపర్ క్యారెక్టర్ డిజైన్ చేసుంటే సినిమా ఇంకోరకంగా ఉండేదన్నాడు. లైగర్ సినిమా కోసం విజయ్ ఎంతో కష్టపడినట్లు చెప్పారు. రెండేళ్లపాటు శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడి పని చేశారన్నారు. సినిమా విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షోకే సినిమా రిజల్ట్ తమకు అర్థమైపోయిందని ఆనంద్ అన్నాడు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. విజయ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’. సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. పరశురామ్, గౌతమ్ తిన్ననూరి సినిమాలు ఇటీలే ప్రారంభం అయ్యాయి.
Bro Theatrical Business :‘బ్రో’ థియేట్రికల్ బిజినెస్.. అక్షరాల వంద కోట్లు..!