Anand Sai : పవన్ కళ్యాణ్ తో స్నేహంపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఆనంద్ సాయి.. ముప్పై ఏళ్లకు నెరవేరింది అంటూ..

ఇటీవల పవన్ కళ్యాణ్, పవన్ తనయుడు అకిరా నందన్, ఆనంద్ సాయి కలిసి కేరళ, తమిళనాడులోని పలు పుణ్య క్షేత్రాలకు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Anand Sai : పవన్ కళ్యాణ్ కి స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారని తెలిసిందే. అలాంటి వారిలో ఆనంద్ సాయి ఒకరు. పవన్ కళ్యాణ్ – ఆర్ట్ డైరెక్టర్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. తొలిప్రేమ సినిమా నుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ వారి వారి రంగాల్లో పైకి ఎదిగారు. ఎంత ఎదిగినా ఇద్దరి స్నేహం మాత్రం వదల్లేదు.

Also Read : Seethamma Vakitlo Sirimalle Chettu : సూపర్ హిట్ మల్టీస్టారర్.. క్లాసిక్ సినిమా.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

రాజకీయాల్లోకి వచ్చాక కూడా పవన్ – ఆనంద్ సాయి కలిసి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తుండగా ఆనంద్ సాయి టీటీడీ బోర్డు మెంబర్ గా సేవ చేస్తున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్, పవన్ తనయుడు అకిరా నందన్, ఆనంద్ సాయి కలిసి కేరళ, తమిళనాడులోని పలు పుణ్య క్షేత్రాలకు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.

 

తాజాగా ఆనంద్ సాయి ఆ ఆధ్యాత్మిక యాత్రలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఓ ఫోటో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆనంద్ సాయి ఈ పోస్ట్ లో.. జీవితంలో గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్ మాత్రమే. అది నాకు దొరికింది. ఎప్పట్నుంచో మేము ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం కలలు కన్నాము. ఈ కోరికే మమ్మల్ని మరింత దగ్గరగా ఉంచింది. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పటికి అది నెరవేరింది. మునుపెన్నడూ లేని విధంగా దివ్య ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టాము అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ పోస్ట్ తో పవన్, ఆనంద్ సాయి మరిన్ని తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ పోస్ట్ తో మరోసారి పవన్ – ఆనంద్ సాయి ఎంత కోజ్ ఫ్రెండ్స్ అనేది అందరికి మరోసారి తెలిసింది.

Also Read : Sammelanam : ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్ రివ్యూ .. ఫ్రెండ్షిప్, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో..