Sammelanam : ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్ రివ్యూ .. ఫ్రెండ్షిప్, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో..
సమ్మేళనం సిరీస్ నిన్న ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Priya Vadlamani Sammelanam Web Series Review
Sammelanam Web Series Review : గణాదిత్య, ప్రియా వడ్లమాని జంటగా తెరకెక్కిన సిరీస్ సమ్మేళనం. సునయని బి, సాకేత్ జె నిర్మాణంలో తరుణ్ మహాదేవ్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కగా విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, శ్రీకాంత్ యాచమనేని, బిందు నూతక్కి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సమ్మేళనం సిరీస్ నిన్న ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే.. రామ్ (గణాదిత్య) ఒక రైటర్. అతడు ఒక బుక్ రాస్తాడు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు దాని గురించి పేపర్లలో పడుతుంది. ఆ బుక్ గురించి తెలిసి అతని పాత ఫ్రెండ్స్ అయిన శ్రీయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్), మేఘన (ప్రియా వడ్లమాని)లు రామ్ ని కలవడానికి వస్తారు. అర్జున్, రామ్ చిన్నప్పటినుంచి మంచి ఫ్రెండ్స్. రామ్ రైటర్ అవ్వాలనుకుంటాడు. దానికి అర్జున్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటాడు. అయితే అర్జున్ తన ఆఫీసులోని మేఘనతో లవ్ లో పడతాడు. అదే అమ్మాయిని రామ్ కూడా ప్రేమిస్తాడు.
మరి ఇద్దరిలో మేఘన ఎవర్ని లవ్ చేస్తుంది? వీళ్ళు ఎందుకు దూరమయ్యారు? ఆ బుక్ లో ఏముంది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి? మేఘన లైఫ్ లో చార్లీ (శ్రీకాంత్ గుర్రం) పాత్ర ఏంటి? చివరకు ఎవరు జంట అవుతారు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
సిరీస్ విశ్లేషణ.. ఈ వెబ్ సిరీస్ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, ఓటీటీలంటే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే రోజుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా సిరీస్ ను క్లీన్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తన కంటే తక్కువ వాళ్లను కూడా మంచిగా చూడాలి అని ఈ సిరీస్ లో చూపించారు. దర్శక రచయితగా తరుణ్ మహాదేవ్ క్లిక్ అయ్యారు. తెలుగు భాష గొప్పదనం కనపడేలా డైలాగ్స్ రాసుకున్నారు.
కథనం, డైలాగ్స్ బాగానే రాసుకున్నా ఫ్రెండ్స్, లవ్ స్టోరీతో ఇది ఒక రెగ్యులర్ రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం రొటీన్ పాయింట్. హీరోయిన్ చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీలో ఓ మెసేజ్ ఇవ్వడం కరెక్ట్ గా సెట్ అవ్వదు అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. గణాదిత్య రైటర్ పాత్రలో స్క్రీన్ ప్రజెన్స్ బాగావుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. ప్రియా వడ్లమాని కూడా తన నటన, ఎమోషనల్ సీన్స్ తో మెప్పిస్తుంది. బిందు, శ్రీకాంత్ గుర్రం, విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ యాచమనేని, జీవన్, ప్రియా రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Chiranjeevi : తల్లి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి.. అలా ప్రచారం చెయ్యొద్దు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. శరవణ వాసుదేవన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. క్యారెక్టర్లతో కథ, కథనాలను బాగానే నడిపించారు. దర్శకుడిగా ప్రేమ కథని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా సిరీస్ కి బాగానే ఖర్చుపెట్టారు.
#Sammelanam
Love, laughter, and a crazy love triangle let the confusion begin! ❤️😂
From Feb 20 on @etvwin#Etvwin@BigFishMedias pic.twitter.com/bfiFsvvngE— ETV Win (@etvwin) February 7, 2025
గమనిక : ఈ సిరీస్ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.