Anand Sai : నా కోసం పవన్ కళ్యాణ్ మా నాన్న దగ్గరకు వెళ్లి.. పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి..

పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి అని అందరికి తెలిసిందే. వీరిద్దరి ఫ్రెండ్షిప్ గురించి అందరూ మాట్లాడుకుంటారు.

Anand Sai Tells how Pawan Kalyan Support to him in his Film Industry Entry

Anand Sai : పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి అని అందరికి తెలిసిందే. వీరిద్దరి ఫ్రెండ్షిప్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎప్పుడో యంగ్ ఏజ్ లో అయిన పరిచయం ఇప్పటికి గొప్ప మిత్రులుగా సాగుతుంది. ఆనంద్ సాయిని ఆర్ట్ డైరెక్టర్ చేసింది కూడా పవన్ కళ్యాణ్. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసారు. స్థపతిగా ఎన్నో ఆలయాలు నిర్మించడంలో కూడా భాగమయ్యారు.

ఆనంద్ సాయి తండ్రి చలం సినిమా పరిశ్రమలో పెద్ద ఆర్ట్ డైరెక్టర్. ఆయన దాదాపు 700 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. అయితే ఆనంద్ సాయి మాత్రం మొదట సినీ పరిశ్రమకు రాలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ సాయి తన సినీ పరిశ్రమ ఎంట్రీ గురించి తెలిపారు.

Also Read : Rana Daggubati : WWE లో రానా.. సరికొత్త రికార్డ్.. ఫోటోలు, వీడియోలు వైరల్..

ఆనంద్ సాయి మాట్లాడుతూ.. నేను అప్పుడప్పుడు డ్రాయింగ్ చేసేవాడిని. అవి చూసి పవన్ బాగున్నాయి అనేవాడు. మా నాన్న పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా నేనెప్పుడూ సినిమాల్లోకి వెళ్తా అనుకోలేదు. నాన్న కూడా వద్దన్నారు. కానీ పవన్ కళ్యాణ్ నాకు తొలిప్రేమ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. మా నాన్న ఒప్పుకోరు అని కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ మా నాన్న దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. మా నాన్న వద్దన్నాడు. మా నాన్న పెద్ద ఆర్ట్ డైరెక్టర్, అతని కొడుకు ఎలాంటి అనుభవం లేకుండా ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తే ఆయన పేరు చెడిపోద్ది అని అన్నారు. కానీ పవన్ నేను నమ్మాను, నమ్మండి అని మా నాన్నని ఒప్పించాడు. నాకు సపోర్ట్ ఇచ్చాడు. నా కెరీర్ కి సపోర్ట్ ఇచ్చాడు పవన్. సెట్స్ లో కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుందని అంటే తేడా వస్తే నా రెమ్యునరేషన్ ఇచ్చేస్తాను అని నిర్మాతకు చెప్పి నేను అనుకున్న సెట్స్ వేసేలా చేసాడు. పవన్ కళ్యాణ్ నా గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు అని తెలిపారు.

Also Read : Singer Pravasthi : పాడుతా తీయగా షోపై, జడ్జిలపై సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు.. ఎక్స్‌పోజింగ్ చేయమన్నారు, బాడీ షేమింగ్ చేశారు..