Ananya Nagalla : అర్ధరాత్రి బస్టాండ్ లో పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పుతున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్..

తాజాగా అనన్య నాగళ్ళ మరో మంచి పనిచేసింది.

Ananya Nagalla : అర్ధరాత్రి బస్టాండ్ లో పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పుతున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్..

Ananya Nagalla Helped Poor People at Midnight Time

Updated On : November 12, 2024 / 5:00 PM IST

Ananya Nagalla : మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు, మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. నటి అనన్య నాగళ్ళ ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల ఏపీలో వరదలు వచ్చిన సమయంలో కూడా ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు సాయం అందించింది. తాజాగా అనన్య నాగళ్ళ మరో మంచి పనిచేసింది.

Also Read : Mukesh Khanna : శక్తిమాన్ మళ్ళీ తిరిగొస్తున్నాడు.. లీకైన ముఖేష్ ఖన్నా వీడియో..

తాజాగా అనన్య నాగళ్ళ అర్ధరాత్రి పూట.. హైదరాబాద్ బస్టాండ్ వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది. పలువురికి దుప్పట్లు చేతికి అందించింది. చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా అనన్యను మరోసారి అంతా అభినందిస్తున్నారు.

 

ఇక అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవలే పొట్టెల్ సినిమాలో ఓ రా & రస్టిక్ క్యారెక్టర్ చేసి మెప్పించింది అనన్య.