Tantra Movie Review : తంత్ర మూవీ రివ్యూ.. అనన్య నాగళ్ళ భయపెట్టిందా..?

హార్రర్ నేపథ్యంతో అనన్య నాగళ్ల నటించిన కొత్త సినిమా 'తంత్ర'. నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎంతవరకు భయపెట్టింది.

Tantra Movie Review : తంత్ర మూవీ రివ్యూ.. అనన్య నాగళ్ళ భయపెట్టిందా..?

Ananya Nagalla Horror Film Tantra Review and rating

Tantra Movie Review : అనన్య నాగళ్ల, శ్రీహరి సోదరుడు కొడుకు అయిన ధనుష్ రఘుముద్రి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఆడియన్స్ ముందుకు వచ్చిన హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘తంత్ర’. నరేష్ బాబు, రవి చైతన్య నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్ట్ చేశారు. ఆల్రెడీ రిలీజైన టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ.. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి థియేటర్స్ లో ఈ సినిమా ఎంతవరకు భయపెట్టింది.

కథ విషయానికొస్తే.. చిన్నతనంలోనే తల్లి కోల్పోయిన రేఖ (అనన్యా నాగళ్ల) తండ్రితో నిత్యం తిట్లు తింటూ పెరుగుతుంటుంది. అలాగే చిన్నతనం నుంచే తన మిత్రుడు అయిన తేజా (ధనుష్ రఘుముద్రి) పై ఇష్టం పెంచుకుంటూ వస్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. కాగా రేఖకి దెయ్యాలు కనిపిస్తుంటాయి. రేఖ పై ఎవరో క్షుద్రపూజలు చేస్తారు. ఆ విషయాన్ని తేజ గమనిస్తాడు.

18 ఏళ్లు ఊరుకి దూరంగా ఉన్న విగతి (టెంపర్ ఫేమ్ వంశీ) మళ్ళీ తిరిగి వచ్చిన దగ్గర నుంచి రేఖకు కష్టాలు మొదలవుతాయి. ప్రతి పౌర్ణమి రోజున రేఖ దగ్గరకు.. రక్తదాహంతో తపించే ఒక పిశాచి వస్తుంటుంది. అసలు విగతికి, రేఖకు సంబంధం ఏంటి..? పౌర్ణమి రోజున రేఖ దగ్గరకు పిశాచి ఎందుకు వస్తుంది..? వీరి కథకి రాజేశ్వరి (సలోని) కి సంబంధం ఏంటి..? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాలి.

Also read : Sharathulu Varthisthai : ‘షరతులు వర్తిస్తాయి’ రివ్యూ.. మధ్యతరగతి జీవితాల కథ..

సినిమా విశ్లేషణ.. హార్రర్ సినిమాల్లో లాజిక్ లేకున్నా పర్వాలేదు గాని, భయపెట్టే సన్నివేశాలు మాత్రం తప్పక ఉండాలి. కథ కథనం లేకున్నా హార్రర్ సీన్స్ తో హిట్స్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అయితే హార్రర్ సినిమా అంటూ వచ్చిన ఈ తంత్ర సినిమాలో అలా భయపెట్టే సీన్స్ అసలు లేకపోవడం ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది.

రామాయణంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు చేసిన క్షుద్రపూజలు, వాటిని లక్ష్మణుడు అడ్డుకున్నాడు అని చెబుతూ ఇంటరెస్టింగా మూవీ లైన్ స్టార్ట్ చేసిన దర్శకుడు.. ఆ తరువాత ఫ్లాట్ గా ముందుకు తీసుకు వెళ్లారు. కథని ఆరు భాగాలుగా విడదీసి ‘రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి’.. విభాగాలుగా చూపించారు. హార్రర్ సినిమాల్లో ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది.

హార్రర్ సీన్స్ పెద్దగా లేకపోవడం, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆడియన్స్ కి బోర్ ని కలిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ లు రివీల్ చేస్తూ ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశారు. అయితే మొదటి నుంచి బాగా స్లోగా సాగుతూ వస్తుండడంతో ప్రీ క్లైమాక్స్ బాగున్నా.. పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

నటీనటులు.. అనన్య నాగళ్ల తన అందంతో, యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ వచ్చే సన్నివేశాల్లో అనన్య అదరగొట్టింది అనే చెప్పాలి. ధనుష్ రఘుముద్రి, సోనాలీది తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయ్యినప్పటికీ తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. అలాగే టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

Also read : Save The Tigers 2 Review : మగజాతి ఆణిముత్యాలు మళ్ళీ వచ్చేశారు.. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 రివ్యూ..

సాంకేతిక విషయాలు.. దర్శకుడు మంచి స్టోరీ పాయింట్ నే రాసుకున్నారు. హార్రర్ సినిమాలకు సంగీత దర్శకుడు చేయాల్సిన న్యాయం ఆర్ఆర్ రుద్రన్ వంద శాతం చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

మొత్తంగా తంత్ర మూవీ కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ తో ఓకే అనిపించింది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.