Save The Tigers 2 Review : మగజాతి ఆణిముత్యాలు మళ్ళీ వచ్చేశారు.. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 రివ్యూ..

‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 1తో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ.. ఇప్పుడు సెకండ్ సీజన్ తో వచ్చేశారు.

Save The Tigers 2 Review : మగజాతి ఆణిముత్యాలు మళ్ళీ వచ్చేశారు.. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 రివ్యూ..

Priyadarshi Abhinav Gomatam Chaitanya Krishna Save The Tigers 2 Review

Updated On : March 15, 2024 / 12:23 PM IST

Save The Tigers 2 Review : ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని.. కపుల్స్ గా ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, రోహిణి.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ వెడ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. తేజ కాకుమాను డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు సెకండ్ సీజన్ వచ్చింది. ఇక ఈ సెకండ్ సీజన్ ని అరుణ్ కొత్తపల్లి డైరెక్ట్ చేస్తుండగా ‘సీరత్ కపూర్’ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.

కథ విషయానికి వస్తే.. హీరోయిన్ అయిన హంసలేఖ (సీరత్ కపూర్) మిస్ అవుతుంది. ఆమె కోసం వెతుకుతున్న పోలీసులకు ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో హంసలేఖ గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం)తో కనిపిస్తుంది. దీంతో వారిని అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. నైట్ పార్టీలో ఈ ముగ్గురితో కలిసి ఎంజాయ్ చేసిన హంసలేఖ ఏమైంది..? అసలు రాత్రి ఏమి జరిగింది అనే విషయాలను సరదాగా చూపించి నవ్వించారు.

ఫైనల్లీ హంసలేఖ కనిపించడంతో ఈ ముగ్గురిని పోలీసులు విడిచిపెడతారు. అయితే ఆ తరువాత నుంచి మరో ఫన్ రోలర్ కోస్టార్ మొదలవుతుంది. హంసలేఖకి ప్రియదర్శి దగ్గరవుతూ ఉంటారు. అలాగే విక్రమ్ తన దగ్గరికి పని చేయడానికి వచ్చిన కొత్త అసిస్టెంట్‌కి, అభినవ్ గోమఠం తన ఇంటిలో పని చేసే రోహిణికి దగ్గరవుతుంటారు. దీంతో వారి భార్యలు సమస్య పరిష్కారం కోసం కౌన్సెలర్ అయిన స్పందన (సత్యకృష్ణ) వద్దకు వెళ్తారు. ఆ తరువాత నుంచి కథ ఎలా మలుపు తిరిగింది అనేది మిగిలిన కథ.

Also read : Lambasingi Review : లంబసింగి మూవీ రివ్యూ.. పోలీస్ కానిస్టేబుల్‌కి, లేడీ నక్సలైట్‌కి మధ్య ప్రేమ కథ..

సిరీస్ విశ్లేషణ.. గతంలో ఇలాంటి కథతో టాలీవుడ్ లో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. స్టోరీ లైన్ ఓల్డ్ అయ్యినప్పటికీ స్క్రీన్ ప్లేని మాత్రం న్యూ ఏజ్ స్టోరీతో రాసుకున్నారు. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇప్పటి ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేశారనే చెప్పాలి. అలాని ఎంటర్టైన్ చేయడం కోసం ఏదో క్రింజ్ కామెడీ కాకుండా క్లీన్ కామెడీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా దర్శకుడు సిరీస్ ని బాగా తెరకెక్కించారు. అలాగే కొన్ని ట్విస్ట్ లతో పాటు మగవారి స్వేచ్ఛ, ఆడవారి హక్కులు అంటూ చాలా సరదాసరదాగా సాగిపోతుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా చూసి ఎంజాయ్ చేసేలా ఉంది.

నటీనటులు.. మొదటి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని తమ తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, ఈ సీజన్ లో నటించిన సీరత్ కపూర్ పాత్రతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Also read : Razakar Review : రజాకార్ మూవీ రివ్యూ.. హైదరాబాద్ నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనం అయింది?

సాంకేతిక విషయాలు.. మహి వి రాఘవ ఈ సిరీస్ ని నిర్మిస్తూనే కథ కథనంలో ముఖ్య పాత్ర వహించారు. యాత్ర 2, సైతాన్ వంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహి వి రాఘవ.. ఇలాంటి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్ తో కూడా ఆడియన్స్ ని మెప్పిస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. అలాగే ఈ షోకి రైటర్స్ గా వ్యవహరించిన మిగిలిన రచయితలు, దర్శకుడు అరుణ్ కొత్తపల్లి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నారు.

మొదటి సీజన్ తో సూపర్ హిట్టుని అందుకున్న మేకర్స్.. ఇప్పుడు సెకండ్ సీజన్ తో కూడా అదే రిపీట్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సెకండ్ సీజన్ మంచి వ్యూయర్ షిప్ ని రాబడుతుంది. ఇక ఈ సీజన్ కూడా హిట్ అవ్వడంతో మేకర్స్.. మూడో సీజన్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మొత్తంగా ఈ సిరీస్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వీకెండ్ కి కుటుంబమంతా కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ సిరీస్ కి 3 రేటింగ్ ఇవ్వచ్చు.

గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.