Ananya Nagalla – CM Chandrababu : సీఎం చంద్రబాబుతో అనన్య నాగళ్ళ భేటీ.. వరద బాధితుల కోసం సాయం చేసిన ఫస్ట్ హీరోయిన్..
ఇటీవలే సినీ ప్రముఖులు సీఎంలను కలిసి తాము ప్రకటించిన విరాళాలను చెక్ రూపంలో అందచేస్తున్నారు.

Ananya Nagalla Meets CM Chandrababu Naidu for helping to Flood Effected People
Ananya Nagalla – CM Chandrababu : ఇటీవల ఏపీ, తెలంగాణలో వచ్చిన వర్షాలకు వరదలు ఏర్పడి పలు ప్రాంతాలు ముంపుకు గురయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధైతుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. ఇటీవలే సినీ ప్రముఖులు సీఎంలను కలిసి తాము ప్రకటించిన విరాళాలను చెక్ రూపంలో అందచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఏకైక హీరోయిన్, మన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షలు విరాళం ప్రకటించింది. తాజాగా నేడు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి అనన్య నాగళ్ళ 2.5 లక్షల రూపాయల చెక్కుని అందచేసింది. దీంతో సీఎం అనన్య నాగళ్లను అభినందించారు. త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చెక్ అందచేయనుంది అనన్య నాగళ్ళ.
Also Read : Bigg Boss 8 : ఏడ్చేసిన విష్ణు ప్రియ.. ఏమైనా చేసుకో పో అన్న ప్రేరణ..
అయితే టాలీవుడ్ లో కోట్లు తీసుకునే హీరోయిన్స్ ఉన్నా వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని, చిన్న హీరోయిన్ అయినా అనన్య నాగళ్ళ తన మంచిమనసుతో సాయం చేసిందని అభిమానులు, నెటిజన్లు ఆమెని అభినందిస్తున్నారు.