Bigg Boss 8 : ఏడ్చేసిన విష్ణు ప్రియ.. ఏమైనా చేసుకో పో అన్న ప్రేరణ..

తాజాగా నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు.

Bigg Boss 8 : ఏడ్చేసిన విష్ణు ప్రియ.. ఏమైనా చేసుకో పో అన్న ప్రేరణ..

Bigg Boss Telugu Season 8 Promo Vishnupriya Fights with Prerana

Updated On : September 18, 2024 / 9:30 AM IST

Bigg Boss 8 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం సాగుతుంది. నామినేషన్స్ అయ్యాక టాస్కులలో కంటెస్టెంట్స్ రెండు టీమ్స్ గా పోరాడుతున్నారు. దీంతో ప్రతిదానికి రెండు టీమ్స్ మధ్య గొడవలు వస్తున్నాయి. నిన్న యష్మి నాగ మణికంఠ మీద ఫైర్ అయింది. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు.

ఈ ప్రోమోలో బాల్స్ గేమ్ లో రెండు టీమ్స్ బాగా గొడవ పడ్డట్టు చూపించారు. ఆ తర్వాత ఫుడ్ విషయంలో విష్ణుప్రియకు, ప్రేరణకు గొడవ అయినట్టు ఉంది. విష్ణుప్రియ కూర్చొని ఏడుస్తుంటే అందరూ తన దగ్గరికి రావడంతో.. ప్రేరణ ఫుడ్ విసిరేసినట్టు వేసింది. ఎవరిదైనా ఆకలే కదా. ఆ విషయంలో నేను హర్ట్ అయ్యాను అంటూ ఏడ్చేసింది. దీంతో కంటెస్టెంట్స్ ప్రేరణని అడగడంతో తాను అలా చేయలేదంటూ గొడవ పడింది.

Also Read : Nayanthara : భర్తని కిస్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి.. స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన నయనతార..

ఆ గొడవ వదిలేసి ప్రేరణ రూమ్ లోకి వెళ్లి కూర్చోవడంతో నాగ మణికంఠ అక్కడికి వెళ్లి ప్రేరణతో అలా యాటిట్యూడ్ చూపించకు అని అంటే.. ఏమైనా చేసుకో పో అని అనేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా నేటి ఎపిసోడ్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..