Nayanthara : భర్తని కిస్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి.. స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన నయనతార..

తాజాగా నేడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజు కావడంతో నయనతార తన భర్తకి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది.

Nayanthara : భర్తని కిస్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి.. స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన నయనతార..

Nayanthara Shares Cute Photos with her Husband Vignesh Shivan and says Birthday Wishes

Updated On : September 18, 2024 / 9:14 AM IST

Nayanthara – Vignesh Shivan : సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా కవల పిల్లల్ని కన్నారు ఈ జంట. రెగ్యులర్ గా నయన్, విగ్నేష్ తమ సోషల్ మీడియాలో క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Nayanthara Shares Cute Photos with her Husband Vignesh Shivan and says Birthday Wishes

Also Read : Heroine Daughter Cute Baby : స్టేజిపై మైక్ పట్టుకున్న ఈ క్యూట్ బేబీ ఎవరో తెలుసా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా నేడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజు కావడంతో నయనతార తన భర్తకి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది. తన భర్తతో ఓ రెస్టారెంట్ లో క్లోజ్ గా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే. నా ప్రేమని మాటల్లో వ్యక్తపరచలేను. నేను, పిల్లలు ఉయర్, ఉలగం నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి దేవుడు ఆశీస్సులు ఉండాలి అని పోస్ట్ చేసింది. దీంతో నయనతార పోస్ట్ వైరల్ గా మారగా.. విగ్నేష్ తో నయన్ షేర్ చేసిన ఫోటోలు చూసి క్యూట్ జంట అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.