Heroine Daughter Cute Baby : స్టేజిపై మైక్ పట్టుకున్న ఈ క్యూట్ బేబీ ఎవరో తెలుసా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
స్టేజిపై మైక్ పట్టుకొని పాట పాడటానికి రెడీ అన్నట్టు క్యూట్ గా నిలుచ్చున్న ఈ బేబీ ఎవరో అనుకుంటున్నారా..

Star Actress Daughter Malti Marie Cute Photo from Singing Stage goes Viral
Heroine Daughter Cute Baby : స్టేజిపై మైక్ పట్టుకొని పాట పాడటానికి రెడీ అన్నట్టు క్యూట్ గా నిలుచ్చున్న ఈ బేబీ ఫోటో ఇపుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఈ బేబీ ఎవరో అనుకుంటున్నారా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూతురు మాల్తీ మేరీ. ప్రియాంక హస్బెండ్ నిక్ జోనస్ స్టార్ సింగర్ అని తెలిసిందే. తాజాగా లండన్ లోని మిలీనియం డోమ్ అనే హాల్ లో నిక్ జోనస్ సింగింగ్ షో సాగింది. ఈ షోలో నిక్ తన భార్య ప్రియాంక, కూతురు మాల్తీ మేరీతో కలిసి వెళ్ళాడు.
అక్కడ స్టేజిపై ప్రియాంక చోప్రా కూతురు మాల్తీ మేరీ ఇలా మైక్ పెట్టుకొని సందడి చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. అయితే ఆ ప్లేస్ కి తనకి స్పెషల్ అటాచ్మెంట్ ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నిక్ జోనస్ సింగింగ్ షోకి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : NTR – Kuchipudi : కూచిపూడి నాట్యం ఎక్కడ నేర్చుకున్నాడో చెప్పిన ఎన్టీఆర్.. లెజండరీ మాస్టర్ వద్ద..
ప్రియాంక చోప్రా ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. లైఫ్ ఫుల్ సర్కిల్. 24 ఏళ్ళ క్రితం నాకు 18 ఏళ్ళ వయసులో ఈ స్టేజి మీద నేను మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నాను. అప్పటి రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. స్టేజిపై హీల్స్ చెప్పులతో, డ్రెస్ తో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇవాళ ఇన్నేళ్ల తర్వాత అదే స్టేజిపై నా కూతురుతో కలిసి నా భర్త, అతని బ్రదర్స్ ప్రోగ్రాం చేస్తున్నారు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ప్రియాంక కూతురు మాల్తీని చూసి ఎంత క్యూట్ ఉందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.