NTR – Kuchipudi : కూచిపూడి నాట్యం ఎక్కడ నేర్చుకున్నాడో చెప్పిన ఎన్టీఆర్.. లెజండరీ మాస్టర్ వద్ద..

తాజాగా ఎన్టీఆర్ తన కూచిపూడి శిక్షణ గురించి మాట్లాడారు.

NTR – Kuchipudi : కూచిపూడి నాట్యం ఎక్కడ నేర్చుకున్నాడో చెప్పిన ఎన్టీఆర్.. లెజండరీ మాస్టర్ వద్ద..

NTR Comments on his Kuchipudi Dance Learning at Devara Press Meet

Updated On : September 18, 2024 / 7:25 AM IST

NTR – Kuchipudi : ఎన్టీఆర్ చాలా మంచి డ్యాన్సర్ అని మనకు తెలిసిందే. ఎన్టీఆర్ చిన్నప్పట్నుంచి డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నాడు. కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నాడు. ఎన్టీఆర్ చిన్నప్పుడు పలు స్టేజిల మీద తన కూచిపూడి పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చాడు. తాజాగా ఎన్టీఆర్ తన కూచిపూడి శిక్షణ గురించి మాట్లాడారు.

Also Read : NTR – Biryani : ఆ బిర్యానీ మిస్ అయిపోద్ది అంటూ ఎన్టీఆర్ కామెంట్స్.. తమిళనాడులో అంత ఫేమస్ బిర్యానీ ఏంటి..?

ఎన్టీఆర్ నిన్న దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చెన్నై నాకు చాలా స్పెషల్ ప్లేస్. చాలా మందికి తెలీదు. నేను చిన్నప్పుడు కూచిపూడి నాట్యం ఇక్కడ చెన్నైలోనే వెంపటి చిన సత్యం సర్ దగ్గరే నేర్చుకున్నాను. అందుకే నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం అని తెలిపారు.

NTR Comments on his Kuchipudi Dance Learning at Devara Press Meet

ఇండియాలోనే లెజెండరీ కూచిపూడి నాట్యకళాకారులు, గురువు.. దివంగత వెంపటి చిన సత్యం. ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో పాటు ఎన్నో నాట్య అవార్డులు, బిరుదులు వచ్చాయి. అలాంటి లెజెండరీ కళాకారుల వద్ద ఎన్టీఆర్ కూచిపూడి నేర్చుకున్నారు.

NTR Comments on his Kuchipudi Dance Learning at Devara Press Meet