Ananya Nagalla : దూసుకుపోతున్న తెలుగమ్మాయి.. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీ రోల్ లో నటించడంతో అనన్య నాగళ్ళ బాగా ఫేమ్ తెచ్చుకుంది.

Ananya Nagalla Ready to Entry in Bollywood
Ananya Nagalla : తెలుగు నుంచి హీరోయిన్స్ వచ్చేది తక్కువే. వచ్చినా ఎక్కువ సక్సెస్ అవ్వరు. కానీ ఇటీవల సక్సెస్ అయిన వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు. సాఫ్ట్ వేర్ జాబ్ నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన అనన్య అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మరో పక్క హీరోయిన్ గా చేస్తూ బిజీగానే ఉంది. మొదటి సినిమా మల్లేశం తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తెలుగమ్మాయి. ఆ తర్వాత ప్లే బ్యాక్ తో కూడా మెప్పించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీ రోల్ లో నటించడంతో అనన్య నాగళ్ళ బాగా ఫేమ్ తెచ్చుకుంది. ఫ్యాన్స్, ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల తనే ముఖ్య పాత్రల్లో సినిమాలు వస్తున్నాయి. తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. లాంటి సినిమాలతో వరుసగా తన నటనతో మెప్పించింది. ఈ సినిమాలు అన్ని ఓటీటీల్లో మంచి ఆదరణ పొందాయి.
Also Read : Sreeleela : శ్రీలీలకు చేదు అనుభవం.. పక్కకు లాక్కెళ్లిన జనాలు.. హీరో, బౌన్సర్లు ఉండగానే..
ఇప్పుడు అనన్య నాగళ్ళ స్మాల్ స్కేల్ వుమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అనన్యతో 5 కోట్ల రేంజ్ లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. చిన్న సినిమాల్లో అనన్య బెస్ట్ ఆప్షన్ గా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అనన్య కూడా మంచి డిఫరెంట్ కథల్ని, పాత్రలని ఎంచుకుంటుంది.
తెలుగులో ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనన్య నాగళ్ళ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే అనన్య ఓ హిందీ ప్రాజెక్టు లో మెయిన్ లీడ్ గా సెలెక్ట్ అయిందని సమాచారం. తెలుగులో రాణిస్తున్న అనన్య హిందీలో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోలు, చీరలో పద్ధతిగా ఫోటోలు పెడుతూ యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram