Sreeleela : శ్రీలీలకు చేదు అనుభవం.. పక్కకు లాక్కెళ్లిన జనాలు.. హీరో, బౌన్సర్లు ఉండగానే..

శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ అక్కడ జరుగుతున్న ఓ ఈవెంట్ కి వెళ్లారు.

Sreeleela : శ్రీలీలకు చేదు అనుభవం.. పక్కకు లాక్కెళ్లిన జనాలు.. హీరో, బౌన్సర్లు ఉండగానే..

Fans Dragged Sreeleela in a Event at Sikkim Video goes viral

Updated On : April 6, 2025 / 4:09 PM IST

Sreeleela : అప్పుడప్పుడు జన సమూహాల్లోకి వెళ్తే సెలబ్రిటీలకు చేదు ఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రీలీలకు ఓ చేదు ఘటన ఎదురైంది. శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ సిక్కింలో జరుగుతుంది. షూటింగ్ అయ్యాక శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ అక్కడ జరుగుతున్న ఓ ఈవెంట్ కి వెళ్లారు.

హీరో, హీరోయిన్స్ వస్తున్నారు అనడంతో అక్కడికి ఫ్యాన్స్, జనాలు బాగానే వచ్చారు. అయితే వాళ్ళ మధ్యలోనుంచి కార్తీక్ ఆర్యన్, శ్రీలీల బౌన్సర్లు సహాయంతో నడిచి వెళ్తుంటే శ్రీలీల చెయ్యి పట్టుకొని పక్కకి లాగేసారు కొంతమంది జనాలు. ఆ సంఘటనకు శ్రీలీల షాక్ అయింది. అక్కడున్న బౌన్సర్లు వెంటనే తేరుకొని శ్రీలీలను తీసుకొచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Dhanush – Karthi : ధనుష్ – కార్తీ భారీ మల్టీస్టారర్.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. కానీ ప్రొడ్యూసర్ దొరకట్లేదంట..

ఈ వీడియో చూసి శ్రీలీల ఫ్యాన్స్ అలా చేసిన వారిపై విమర్శలు చేస్తున్నారు. ఒక హీరోయినేని అలా లాగేయడమేంటి అని తిడుతున్నారు. అక్కడున్న బౌన్సర్లు కూడా సరిగ్గా పట్టించుకోలేదు అని అంటున్నారు. మొత్తానికి శ్రీలీలని కొంతమంది జనాల్లో లాగేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. మరి దీనిపై శ్రీలీల ఏమైనా స్పందిస్తుందో చూడాలి.