Dhanush – Karthi : ధనుష్ – కార్తీ భారీ మల్టీస్టారర్.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. కానీ ప్రొడ్యూసర్ దొరకట్లేదంట..
ధనుష్, కార్తీ కలిసి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారు.

Director Selva Raghavan Said Dhanush Karthi Movie Yuganiki Okkadu Sequel didn't find Producers
Dhanush – Karthi : ప్రస్తుతం మల్టీస్టారర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం, లేదా ఒక హీరో సినిమాలో ఇంకో హీరో గెస్ట్ అప్పీరెన్స్, రోల్ చేయడం జరుగుతున్నాయి. అయితే కథ రెడీగా ఉన్న ఓ భారీ మల్టీస్టారర్ కి నిర్మాతే దొరకట్లేదంట. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
ధనుష్, కార్తీ కలిసి ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన యుగానికి ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో కార్తీ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కొన్నేళ్ల క్రితం ప్రకటించాడు దర్శకుడు. సీక్వెల్ లో మెయిన్ హీరో ధనుష్ అని చెప్పాడు. యుగానికి ఒక్కడు సినిమా చివర్లో కార్తీ.. రాజు కొడుకు ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడు పెద్దయిన తర్వాత నుంచి కథ ఉంటుందని కూడా చెప్పారు.
Also Read : Ashu Reddy : అషు రెడ్డి ఏం చదివిందో తెలుసా..? అమెరికాలో జాబ్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
యుగానికి ఒక్కడులో కార్తీ మెయిన్ లీడ్ కాబట్టి సీక్వెల్ లో కంటిన్యుటీ కోసం కార్తీ కూడా కొన్ని సీన్స్ లో ఉంటాడని, ధనుష్ మాత్రం మెయిన్ లీడ్ అని తెలుస్తుంది. ధనుష్ – కార్తీ లాంటి స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో ఉన్నారంటే ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. అయితే తాజాగా డైరెక్టర్ సెలవే రాఘవన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ యుగానికి ఒక్కడు సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. యుగానికి ఒక్కడు సీక్వెల్ తీస్తాను. కానీ త్వరగా అనౌన్స్ చేసాము అనిపిస్తుంది. ధనుష్ తోనే సినిమా చేస్తాను. కార్తీ కూడా ఉంటాడు. కానీ దానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. కనీసం ఆర్టిస్ట్ లవి ఒక సంవత్సరం డేట్స్ కావాలి. అందుకే ఆలస్యం అవుతుంది. కానీ అందరూ నన్ను తిడతారు ఇంకా ఎందుకు తీయట్లేదు అని అన్నారు.
Also Read : Ram Charan Vs Nani : నాని ‘ప్యారడైజ్’ వర్సెస్ రామ్ చరణ్ ‘పెద్ది’.. వచ్చే శ్రీరామ నవమికి బాక్సాఫీస్ ఫైట్..
సెల్వ రాఘవన్ ధనుష్ అన్నే కాబట్టి డేట్స్ అడిగితే సినిమా కోసం ధనుష్ ఇస్తాడు. కార్తీ కూడా బిజీగా ఉన్నా యుగానికి ఒక్కడు సీక్వెల్ కాబట్టి డేట్స్ ఇస్తాడు. కానీ మంచి ప్రొడ్యూసర్ కావాలి అనడంతో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా నిర్మాత దొరకలేదా అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మరి యుగానికి ఒక్కడు సీక్వెల్ వస్తుందా? ఎప్పటికి తెరకెక్కిస్తారో చూడాలి.