Ashu Reddy : అషు రెడ్డి ఏం చదివిందో తెలుసా..? అమెరికాలో జాబ్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
బిగ్ బాస్ కి వచ్చే ముందు అషు ఏం చేసింది? ఏం చదువుకుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Do You Know Ashu Reddy Study and what she Did before coming into BIgg Boss
Ashu Reddy : అమెరికాలో ఉంటూ టిక్ టాక్ వీడియోలు, రీల్స్ తో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమ్ తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ వచ్చే ముందే ఓ సినిమాలో నటించింది అషు. బిగ్ బాస్ కి వచ్చే ముందు అషు ఏం చేసింది? ఏం చదువుకుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
అషు రెడ్డి మాట్లాడుతూ.. మాది వైజాగ్. పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టాను. MBA లో HR మేనేజ్మెంట్ చేశాను. అమెరికాలో కొన్నాళ్ళు జాబ్ చేశాను. అమెరికాలో ఉన్నప్పుడు రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసేదాన్ని. అమెరికాలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ సర్ నిర్మాతగా, నితిన్ హీరోగా చేసిన ఛల్ మోహన్ రంగ సినిమాలో ఓ అవకాశం వచ్చింది. అమెరికాలోనే షూట్. అందులో నటించాను. అప్పుడే జాబ్ వదిలేసి ఏదైనా చేయాలి అనుకునేదాన్ని. ఆ సినిమా రిలీజయ్యాక బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. దాంతో ఇండియాకు తిరిగొచ్చేసాను అని తెలిపింది.
Also Read : Ram Charan Vs Nani : నాని ‘ప్యారడైజ్’ వర్సెస్ రామ్ చరణ్ ‘పెద్ది’.. వచ్చే శ్రీరామ నవమికి బాక్సాఫీస్ ఫైట్..
ఛల్ మోహన్ రంగ సినిమాలో అమెరికాలో ఉండే పలు సీన్స్ లో హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్ లా అషురెడ్డి కనిపిస్తుంది. 2018 లో ఛల్ మోహన్ రంగ సినిమా రిలీజవ్వగా 2019 లో అషుకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.
ఇక అషు రెడ్డి బిగ్ బాస్ లో పాల్గొని బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకొని టీవీ షోలలో యాంకర్ గా, పార్టీసిపెంట్ గా చేస్తుంది. సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అషురెడ్డి టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉంది.