మాల్దీవుల్లో మళ్లీ అందాల అలలు… సూరీడుతో సై అంటోన్న అనన్య

Bollywood in Maldives: బాలీవుడ్ సెలబ్రిటీలు మాల్దీవులకు క్యూ కట్టినట్లు కనిపిస్తుంది. టూరిస్ట్ హాట్‌స్పాట్ అయిన మాల్దీవులకు గత నెల వరుస పెట్టిన సెలబ్రిటీలు కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి రెడీ అయిపోయారు. తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, తారా సుతారియా, టైగర్ ష్రాఫ్, దిశా పటానీల అందాల ఆభరణాలతో మెరిసిన మాల్దీవులకు మరోసారి బాలీవుడ్ బ్యూటీలు జోష్ నింపుతున్నారు.
ఈ మేర కియారా అద్వానీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోలో గోల్డెన్ షేడ్ తో ఉన్న డ్రెస్ వేసుకున్న కియారా.. బ్యాక్ ఫోజ్ లో కనిపించింది. అటుగా వస్తున్న నీలి అలలను చూస్తూ 2021.. నిన్నే చూస్తున్నా అంటూ పోస్టు చేసింది.
View this post on Instagram
సినిమా గాసిప్పులను బట్టి కియారా బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా కూడా మాల్దీవుల్లోనే ఉన్నాడు. తన ఇన్ స్టాలో మాల్దీవుల్లో పిక్చర్స్ పోస్టు చేశాడు కానీ, అందులో కియారా కనిపించలేదు.
View this post on Instagram
ఇదిలా ఉంటే ఖాలీ పీలి కో స్టార్స్ అనన్య పాండే, ఇషాన్ కట్టర్ లు కూడా మాల్దీవుల్లోనే మకాం వేశారు. స్విమ్మింగ్ తర్వాత బర్గర్, కొన్ని ఫ్రైస్ తింటూ ఎంజాయ్ చేస్తున్నానని పోస్టు చేసింది. నేను నాలా తయారవుతున్నా. అంటూ మేకప్ లేని ఫొటో ఒకటి పోస్టు చేసింది.
View this post on Instagram
ఇషాన్ కూడా పూల్ దగ్గర నిల్చొని స్విమ్మింగ్ కు రెడీ అవుతున్న ఫోజ్ ను పోస్టు చేశాడు. స్టన్నింగ్ సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తున్నా అని రాసుకొచ్చాడు. కొద్దిరోజుల ముందు దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ లు వాళ్ల ట్రిప్ గురించి పిక్చర్స్, వీడియోలు షేర్ చేసుకున్నారు.
View this post on Instagram