Anasuya : స్వాతంత్ర సమరయోధురాలు ‘బేగం హజ్రత్ మహల్’గా అనసూయ.. సినిమానా..?

పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు దూసుకు పోతున్న అనసూయ.. తాజాగా స్వాతంత్ర సమరయోధురాలు 'బేగం హజ్రత్ మహల్'గా కనిపిస్తూ ఒక ఫోటోని షేర్ చేసింది. బయోపిక్ రాబోతోందా..?

Anasuya : స్వాతంత్ర సమరయోధురాలు ‘బేగం హజ్రత్ మహల్’గా అనసూయ.. సినిమానా..?

Anasuya Bharadwaj in freedom fighter Begum Hazrat Mahal

Anasuya Bharadwaj : టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ టీవీ షోలతో మంచి పాపులారిటీ సంపాదించుకొని, ఆ తరువాత పలు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసి ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతుంది. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషించి అదరగొట్టింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే అనసూయ.. తాజాగా చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్వాతంత్ర సమరయోధురాలు అయిన ‘బేగం హజ్రత్ మహల్’ ఫోటోతో అదే లుక్ లో ఉన్న తన ఫోటోని కూడా అనసూయ షేర్ చేసింది.

Karthik Dandu : విరూపాక్ష దర్శకుడు నుంచి మరో థ్రిల్లర్.. ఈసారి పురాణగాథలోని మిస్టరీ..

దీంతో అనసూయ ఆమె బయోపిక్ లో నటించబోతుందా అని అందరిలో ఒక ప్రశ్న మొదలైంది. అయితే ఇదేమి బయోపిక్ కాదు. ఈ ఏడాదితో మనం 76వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకను జరుపుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు ఈ ఆగష్టు 15న స్వాతంత్ర సమరయోధుల త్యాగాని గుర్తు చేసుకుంటూ ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే అనసూయ కూడా సమరయోధుల పట్ల తనకి ఉన్న భక్తి భావాన్ని తెలియజేసింది. 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమములో కీలకపాత్ర పోషించిన బేగం హజ్రత్ మహల్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఆమెలా కనిపిస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు చరిత్ర మనకి గొంతు ఎత్తి తెలియజేయని ‘బేగం హజ్రత్ మహల్’ వంటి స్వాతంత్ర సమరయోధులు గురించి తెలుసుకుందాం అని పేర్కొంది.

Kushi Movie : విజయ్ దేవరకొండ సమంత ఖుషి ఆడియో లాంచ్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..

స్వాతంత్ర పోరాటం మొదలైన సమయంలో పోరాడని మొదటి మహిళా సమరయోధులలో బేగం హజ్రత్ ఒకరు. 1856లో బ్రిటిష్ సైనికులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆవాద్ ను స్వాధీనం చేసుకున్న సమయంలో బేగం హజ్రత్ అవధ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక ఆ సమయంలో బ్రిటిష్ సైనికులతో బేగం హజ్రత్ దళం రాజా జైలాల్ సింగ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసింది. బ్రిటిష్ నుంచి లక్నోను స్వాధీనం చేసుకున్న తరువాత తన కుమారుడైన బిర్జిస్ ఖద్రను అవధ్ పాలకుడుగా బేగం హజ్రత్ ప్రకటించారు. 1879లో ఆమె నేపాల్ రాజధాని ఖాట్మండులో మరణించారు. ఆమె పోరాట స్ఫూర్తికి గుర్తుగా భారత్ ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ ని కూడా విడుదల చేసింది.