Anasuya : మరోసారి విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ.. ఇకపై దీని గురించి మాట్లాడను.. నాకు మనశ్శాంతి కావాలి..

అనసూయ(Anasuya), విజయ్ దేవరకొండ మధ్య అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా నుంచి వివాదం కొనసాగుతోంది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలకాలనుకుందేమో అనసూయ.

Anasuya : మరోసారి విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ.. ఇకపై దీని గురించి మాట్లాడను.. నాకు మనశ్శాంతి కావాలి..

Anasuya gives clarity on vijay devarakonda issue

Updated On : June 11, 2023 / 6:35 AM IST

Vijay Devarakonda :  అనసూయ(Anasuya), విజయ్ దేవరకొండ మధ్య అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా నుంచి వివాదం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ రచ్చ సాగుతూనే ఉంటుంది. ఒక్కోసారి అసలు సంబంధమే లేకుండా విజయ్ దేవరకొండని ఇండైరెక్ట్ గా ట్విట్టర్ లో కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలెట్ అవుతుంది అనసూయ. ఇటీవల కూడా కొన్ని రోజుల క్రితం అలాగే విజయ్ పై ట్వీట్ వేయడంతో ఈ సారి అభిమానులు మాత్రమే కాక సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా అనసూయని ఇండైరెక్ట్ గా ట్రోల్ చేయడంతో అనసూయకు ఏం చేయాలో తెలియలేదు.

దీంతో ఈ వివాదానికి ముగింపు పలకాలనుకుందేమో అనసూయ. ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇకపై విజయ్ దేవరకొండతో ఉన్న వివాదాన్ని నేను కొనసాగించాలనుకోవడంలేదు. విజయ్ కి సంబంధించిన వ్యక్తులు డబ్బులిచ్చి మరీ నాపై ట్రోల్ చేస్తున్నారు అని మాట్లాడింది. తాజాగా అనసూయ నటించిన విమానం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు దీనిపై ప్రశ్నించారు.

Naga Babu: ప‌వన్ పై మెగాబ్ర‌ద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. అప్పుడు మార్గ‌నిర్దేశం చేశా.. ఇప్పుడు అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నా

దీంతో తాజాగా అనసూయ మరోసారి విజయ్ తో ఉన్న వివాదంపై మాట్లాడుతూ.. అవును, విజయ్ తో ఉన్న వివాదం నేను కొనసాగించాలనుకోవట్లేదు. నాకు మానసిక ప్రశాంతత కావాలి. ఈ విషయంలో విజయ్ కి కూడా కాల్ చేశాను కానీ రెస్పాండ్ అవ్వలేదు. నాకు ఎవరూ ప్రమోషన్స్ చేయరు. నాకు నేనే మాట్లాడతాను. ఈ వివాదం గురించి ఎప్పట్నుంచో మాట్లాడాలి అనుకున్నాను. దీనివల్ల నా మెంటల్ పీస్ పోగొట్టుకోలేను. అందుకే ఈ వివాదాన్ని ఇంతటితో ఆపాలనుకుంటున్నాను అని తెలిపింది. మరి అనసూయ ఆపినా విజయ్ ఫ్యాన్స్ ఆపుతారో లేదో చూడాలి. ఇప్పటికైతే దీనిపై విజయ్ ఫ్యాన్స్ స్పందించలేదు.