Ari Movie Song : అనసూయ ‘అరి’ సినిమా నుంచి నుంచి ‘భగ భగ..’ సాంగ్ రిలీజ్.. సినిమా మాత్రం వాయిదా..
తాజాగా ఈ అరి సినిమా నుంచి భగ భగ మండే.. అంటూ సాగిన పాటని విడుదల చేసారు.

Anasuya Sai Kumar Ari Movie Song Released
Ari Movie Song : పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్ గా గుర్తింపుని తెచ్చుకున్న జయశంకర్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘అరి’ సినిమాతో రాబోతున్నాడు. సుమన్, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. అరిషడ్వర్గాలలోని కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరుగుతూ అరి సినిమా ఉండబోతుంది. ఈ సినిమా చివర్లో కృష్ణుడ్ని చూపించే సీన్ కూడా ఉందని తెలుస్తుంది.
తాజాగా ఈ అరి సినిమా నుంచి భగ భగ మండే.. అంటూ సాగిన పాటని విడుదల చేసారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో షణ్ముఖ ప్రియ, రోహిత్ పాడారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
అయితే అరి సినిమా రిలీజ్ మాత్రం వాయిదాల మీద వాయిదా పడుతుంది. పేపర్ బాయ్ తర్వాత డైరెక్టర్ జయశంకర్ గీత ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలి. కానీ కరోనా కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఈ అరి సినిమా షూటింగ్ పూర్తయి రెండేళ్లు అవుతుంది. సినిమా కూడా ఫైనల్ కాపీ వచ్చి చాలా రోజులు అవుతుంది. గతేడాది లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. ప్రమోషన్స్ కూడా చేసారు. కానీ పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతుంది.
Also Read : Ram Charan Vs Nani : నాని ‘ప్యారడైజ్’ వర్సెస్ రామ్ చరణ్ ‘పెద్ది’.. వచ్చే శ్రీరామ నవమికి బాక్సాఫీస్ ఫైట్..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి, ఇస్కాన్ ప్రముఖులు, చిన్న జీయర్ స్వామి.. పలువురు ఇప్పటికే ఈ సినిమా చూసి అభినందనలు తెలిపారు. సినిమాకు ఆ సమయంలో బజ్ వచ్చింది కానీ ఈ సినిమా ఎందుకో రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సాంగ్ ని కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో రిలీజ్ చేయించారు. మరి ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందా చూడాలి.