Anasuya: కృష్ణవంశీ కోసం అనసూయ ఏం చేస్తోందంటే..?
బుల్లితెరపై అందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకున్న బ్యూటీ అనసూయ, సినిమాల్లోనూ తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే పలు సినిమాల్లో....

Anasuya Started Dubbing For Krishna Vamsi Rangamarthanda
Anasuya: బుల్లితెరపై అందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకున్న బ్యూటీ అనసూయ, సినిమాల్లోనూ తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అనసూయ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం చిత్రంలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక ఆ తరువాత పలు ఇంట్రెస్టింగ్ పాత్రలు చేస్తూనే, బుల్లితెరపై కూడా తన హవా కొనసాగిస్తూ వస్తోంది.
Anasuya : పలుచని చీరలో అనసూయ పరువాలు
అయితే తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా అనసూయ ‘రంగమార్తాండ’ సినిమాలోని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెబుతోంది. ఈ మేరకు ఆమె డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Anasuya: మధురవాణిగా మారుతున్న దాక్షాయణి..?
ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో సినిమా చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు అనసూయ పేర్కొంది. ఇక ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Actress @anusuyakhasba starts dubbing ?️ for #Rangamarthanda@director_kv @kalipu_madhu pic.twitter.com/9dUNtmxpHB
— Vamsi Kaka (@vamsikaka) July 11, 2022