అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు యాంకర్‌గా మరోవైపు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అసభ్య కామెంట్స్ చేసిన యువకులకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ వెళ్లింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతుండగా కొందరు యువకులు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో సదరు యువకులపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెప్పు తెగుద్ది అంటూ మండిపడింది.
OG : పవన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. OG మూవీ టీమ్ మాస్టర్ ఫ్లాన్..!
మీ ఇంట్లో అమ్మ, చెల్లి, ప్రియురాలు, మీ కాబోయే భార్యను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించింది. పెద్దవారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వారు నేర్పించలేదా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఆమె మాటాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.