OG : పవన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. OG మూవీ టీమ్ మాస్టర్ ఫ్లాన్..!
పవన్ కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

OG movie team plannning non stop PROMOTIONS
పవన్ కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వంలో DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో హైప్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఓజీ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఓజస్ గంభీర అనే క్యారెక్టర్‌లో కనిపించనుండటంతో క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఓజీ టీమ్ నాన్-స్టాప్ ప్రమోషన్స్‌తో జోష్ పెంచాలని ప్లాన్ చేస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారని టాక్. ఆగస్ట్ 2న ఓజీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుందని, దాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి టీమ్ సిద్ధమవుతోందని సమాచారం.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సౌండ్‌ట్రాక్ ఫ్యాన్స్‌ని మరింత ఆకట్టుకోనుందని అంటున్నారు. ప్రమోషన్ ఈవెంట్స్‌తో సినిమా హైప్‌ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
Thank You Dear : థ్యాంక్యూ డియర్’ మూవీ రివ్యూ..
పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఓజస్ గంభీర ఒక రిటైర్డ్ గ్యాంగ్‌స్టర్‌గా, రివేంజ్ కోసం తిరిగి వస్తాడనే కాన్సెప్ట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ఈ సినిమాలో అకీరానంద్ క్యారెక్టర్ ఎంట్రీ గురించి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అకీరా క్యామియో రోల్ చేస్తున్నాడా.? అసలు ఓజీలో కనిపిస్తాడా లేడా అన్నదానిపై సస్పెన్స్‌లో ఉంచారు. ఎమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ వంటి బలమైన తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.