Thank You Dear : థ్యాంక్యూ డియర్’ మూవీ రివ్యూ..
థ్యాంక్యూ డియర్ సినిమా నేడు ఆగస్టు 1న థియేటర్స్ లో రిలీజయింది.

Thank You Dear
Thank You Dear : మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో తోట శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థ్యాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా మెయిన్ లీడ్స్ లో నటించగా వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు.. పలువురు కీలక పాత్రలు పోషించారు. థ్యాంక్యూ డియర్ సినిమా నేడు ఆగస్టు 1న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. సత్యం(ధనుష్ రఘుముద్రి) డైరెక్టర్ కావాలని హైదరాబాద్ వచ్చి ట్రై చేస్తూ ఉంటాడు. జాను(రేఖ నిరోషా)ఆర్టిస్ట్ కావాలని హైదరాబాద్ కి వస్తుంది. ఇక్కడ బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కష్టం అని ఇద్దరూ కలిసి భార్యాభర్తలుగా రూమ్ తీసుకొని ఉంటారు. సత్యం లైఫ్ లోకి అనుకోకుండా ప్రియా(హెబ్బా పటేల్) వస్తుంది. సత్యం – ప్రియ ప్రేమించుకుంటారు. కానీ సత్యం – జానుకు నిజంగానే పెళ్లి అయిందనుకొని ప్రియ సత్యంను నిలదీస్తుంది. ఇదే సమయంలో సిటీలో కొన్ని మర్డర్లు జరుగుతూ ఉంటాయి. వాటికి ప్రియకు సంబంధం ఉందేమో అని కొంతమంది అనుమానిస్తారు. సత్యం తన వల్ల ఓ చిన్న బాబు చనిపోయాడని భావిస్తాడు. అసలు ఆ హత్యలు చేసేది ఎవరు? సత్యం – ప్రియ ప్రేమ ఏమవుతుంది? ఆ బాబు నిజంగానే చనిపోయాడా? జాను ఏమైంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ మర్డర్స్ అని లీడ్ ఇచ్చి ఆసక్తి కలిగేలా చేసి తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కామెడీ సీన్స్ తో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ఓ మంచి బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పేలా చేసారు. ఇక సెకండ్ హాఫ్ లో మర్డర్స్ తో పాటు హీరో పై కథ నడుస్తుంది. సమాజంలో జరిగే వివిధ అంశాలను తీసుకొని వాటిపై కథ రాసుకున్నారు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి, కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎలాంటి మార్పులు వస్తాయి అని చూపించే ప్రయత్నం చేస్తారు. కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. హేబా పటేల్ – ధనుష్ మధ్య లవ్, రొమాన్స్ సీన్స్ బాగానే రాసుకున్నారు. అక్కడక్కడా సినిమా స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫె లో వచ్చే ట్విస్ట్ లు మెప్పిస్తాయి. అయితే సినిమా టైటిల్ థ్యాంక్యూ డియర్ అని ఎందుకు పెట్టాడో డైరెక్టర్ కే తెలియాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సినీ పరిశ్రమలో సక్సెస్ అవ్వాలనే పాత్రలో, లవర్ గా ధనుష్ రఘుముద్రి బాగానే నటించాడు. హెబ్బా పటేల్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించింది. రేఖ నిరోషా కూడా రెండు షేడ్స్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. వీరశంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, బలగం సుజాత, చత్రపతి శేఖర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : National Awards : తెలుగు డైరెక్టర్స్ చేసిన తమిళ్, హిందీ సినిమాలకు నేషనల్ అవార్డులు.. ఏ విభాగంలో ఎవరికి?
సాంకేతిక విశ్లేషణ.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు మెప్పిస్తాయి. డబ్బింగ్ కొన్ని చోట్ల సరిగ్గా కుదరలేదు. ఎడిటింగ్ లో కూడా కొన్ని సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది. ఓ లవ్ స్టోరీ, థ్రిల్లింగ్ కథని మిక్స్ చేసి ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా థ్యాంక్యూ డియర్ సినిమా లవ్ స్టోరీతో పాటు థ్రిల్లర్ జానర్ లో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
https://www.youtube.com/watch?v=wG2g8DL0SqU
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.