Salaar Movie Fame Anchor Jhansi : నా జీవితంలో ఈ సంవత్సరం ముగ్గుర్ని కోల్పోయాను.. ఝాన్సీ ఎమోషనల్ పోస్ట్

యాంకర్ ఝాన్సీ‌కి పవర్ ఫుల్ యాంకర్‌గా పేరుంది. తాజాగా ఝాన్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

Anchor Jhansi

Salaar Movie Fame Anchor Jhansi : యాంకర్ ఝాన్సీ పరిచయం అక్కర్లేని పేరు. వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించారు. యాంకర్‌గా అవకాశాలు తగ్గినా ఇటీవల ప్రభాస్ సలార్‌లో కీ రోల్‌లో నటించి మెప్పించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఝాన్సీ తాజాగా 2023 తనకు కన్నీళ్లను మిగిల్చిందని పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

Sriya Reddy : ‘సలార్’ సినిమా గురించి బోలెడన్ని విషయాలు చెప్పిన శ్రియారెడ్డి.. పార్ట్ 2 గురించి ఏం చెప్పిందంటే..

యాంకర్ ఝాన్సీ గతంలో అనేక టీవీ షోలకు యాంకరింగ్ చేసారు. పలు మూవీ కార్యక్రమాలను హోస్ట్ చేసారు. కొంతకాలంగా ఝాన్సీ యాంకరింగ్‌కి దూరంగా ఉన్నారు. ఝాన్సీ నిర్మోహమాటం.. ముక్కుసూటితనం వల్లే అవకాశాలకు  దూరమయ్యారని  కొందరు ఉంటారు. టీవీ షోలకు దూరమైనా సినిమాలతో బిజీగానే ఉన్నారు ఝాన్సీ. ప్రభాస్ ‘సలార్’ సినిమాలో కీ రోల్ దక్కించుకున్న ఝాన్సీ బాగానే నటించారు. కాగా.. ఝాన్సీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతోంది. ‘డాడీ, బడ్డీ, శ్రీను వెళ్లిపోయారు.. 2023 కన్నీటిని మిగిల్చింది.. ప్రేయర్స్’ అంటూ వారి ముగ్గురి ఫోటోలను షేర్ చేసుకున్నారు. 2023 లో ఝాన్సీ తండ్రి, ఆమె ఎంతో అభిమానంగా పెంచుకునే డాగ్ బడ్డీ, తన దగ్గర కొన్నేళ్లుగా పీఏగా పనిచేస్తున్న శ్రీను చనిపోయారు.  వీరి మరణం గుర్తు చేసుకుంటూ ఝాన్సీ ఈ పోస్టు పెట్టారు. ఝాన్సీ పోస్టుకి ధైర్యంగా ఉండమంటూ నెటిజన్లు రిప్లై ఇచ్చారు.

Salaar : ‘సలార్’ సినిమా నుంచి యాక్షన్ ప్రోమో చూశారా?

1994 లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ 45 కు పైనే తెలుగు సినిమాల్లో నటించారు. ఎగిరే పావురమా, పెళ్లి పీటలు, రావోయి చందమామ, అష్టా చమ్మా, మస్కా, పంజా, సింహా, పటాస్, సోగ్గాడే చిన్ని నాయనా, F3, వాల్తేరు వీరయ్య, దసరా, సలార్ పార్ట్ 1 వంటి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తోటి యాంకర్ జోగినాయుడుని వివాహం చేసుకుని బ్రేకప్ అయిన తర్వాత తన కూతురితో ఉంటున్నారు ఝాన్సీ.