Sriya Reddy : ‘సలార్’ సినిమా గురించి బోలెడన్ని విషయాలు చెప్పిన శ్రియారెడ్డి.. పార్ట్ 2 గురించి ఏం చెప్పిందంటే..
తాజాగా శ్రియారెడ్డి సలార్ సక్సెస్ లో భాగంగా మీడియాతో ముచ్చటించగా సలార్ సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.

Sriya Reddy Exclusive Interview about Salaar Movie
Sriya Reddy : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన సలార్(Salaar) పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది సలార్ సినిమా. ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సలార్ సినిమాలో వరదరాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరిగా రాధా రామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియారెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతున్నారు. మూవీలో ఆమె యాక్టింగ్‌కి, లుక్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
తాజాగా శ్రియారెడ్డి సలార్ సక్సెస్ లో భాగంగా మీడియాతో ముచ్చటించగా సలార్ సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. అలాగే పార్ట్ 2 గురించి కూడా మాట్లాడింది.
Also Read : Sriya Reddy : సలార్‌లో నటించిన శ్రియారెడ్డి.. ఆ ఇండియన్ క్రికెటర్ కుమార్తె అని మీకు తెలుసా..?
#ప్రశాంత్ నీల్ సింపుల్‌గా సలార్ సినిమా గురించి చెప్పినప్పుడు ముందు వద్దన్నాను. కానీ నీల్ మాత్రం పట్టు వదలకుండా నన్ను నటించాలన్నారు. ఓసారి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకోమని అన్నారు. హీరో ఎవరైనా పర్లేదు. నా క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉండాలని చెప్పాను. నా రోల్ చాలా బావుంటుంది అని చెప్పి కథ వినిపించారు. పొగరు సినిమా చూసే ఈ క్యారెక్టర్ నా కోసం రాసుకున్నాను అని చెప్పారు నీల్. ఒరిజినల్ స్క్రిప్ట్‌లో నా క్యారెక్టర్ లేదు. కానీ సలార్ మీద వర్క్ చేస్తున్నప్పుడు లేడీ విలన్ ఉంటే బావుంటుందని నీల్ నన్ను సంప్రదించారు.
#నీల్ గారికి నా పాత్రను ఏదో విలనీగా, అరుస్తున్నట్లు చూపించకూడదని అనుకోని విలనిజం టచ్ ఉంటూనే అందంగా కనిపించేలా నా పాత్రను డిజైన్ చేశారు. రాధా రమ పాత్రను డిజైన్ చేస్తున్నప్పుడు లుక్ పరంగా చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. వెండితో నా అభరణాలు చేయించారు. టాటూ కూడా ఉండాలని అనుకున్నాం. కానీ తర్వాత వద్దనుకున్నాం. రాధా రమ పాత్రను చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేసి అభినందించారు.
#ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. చాలా కూల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఎక్కువగా మాట్లాడడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు.
#గేమ్ ఆఫ్ థ్రోన్స్, కెజియఫ్, బాహుబలి సినిమాలను గమనిస్తే వాటి మొదటి భాగాలు ఎవరికీ అర్థం కావు. సలార్ కూడా అంతే. సలార్ సీజ్ ఫైర్‌లో మేం అసలు కథేంటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి ప్రయత్నించాం. ఇక సెకండ్ పార్ట్ చూస్తే నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంది. దాని కోసం అందరం వెయిట్ చేయాల్సిందే. సలార్ సీజ్ ఫైర్‌లో నా పాత్ర పెద్దగా కనిపించదు. సెకండ్ పార్ట్‌లో ఎక్కువగా కనిపిస్తాను. సలార్ సీజ్ పైర్ ను మించి సెకండ్ పార్ట్ ఉంటుంది అని తెలిపింది శ్రియరెడ్డి.
Also Read : Kalyan Ram : ‘అమిగోస్’ ఎందుకు ఫ్లాప్ అయింది? ‘డెవిల్’ ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..