Mahesh Babu – Pradeep : మహేష్ బాబుకి ప్రదీప్ అంటే ఎంత ఇష్టమంటే.. చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్లి.. ఛానల్ వాళ్ళతో మాట్లాడి..
ఈ క్రమంలో మహేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు ప్రదీప్.

Anchor Pradeep Tells About Interesting Things with Mahesh Babu and How much he close to him
Mahesh Babu – Pradeep : యాంకర్ గా ప్రదీప్ తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. గత కొన్నాళ్లుగా యాంకర్ గా గ్యాప్ ఇచ్చి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రదీప్ హీరోగా మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా పర్వాలేదనిపించింది. ఇప్పుడు రెండో సినిమాతో రాబోతున్నాడు.
ప్రదీప్, దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ప్రదీప్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ప్రదీప్ యాంకర్ సుమ చాట్ షోకి రాగా ఈ షోలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు.
మహేష్ బాబు గురించి ప్రదీప్ చెప్తూ.. నేను మహేష్ బాబు గారిని మొదటిసారి నా షోలోనే కలిసాను. అప్పటివరకు ఆయన్ని దూరం నుంచి చూడటం తప్ప డైరెక్ట్ గా కూడా మాట్లాడలేదు. నా కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను షోకి గెస్ట్ గా అడగడానికి వెళ్ళాను. ఓకే చెప్పారు. ఒక హోటల్ లో సెట్ వేసాము షూటింగ్ కోసం. మహేష్ గారు 20 నిమిషాలే టైం ఇచ్చారు. కానీ నేను షోలో ఇంటర్వ్యూ చేస్తుంటే టైం దాటిపోయింది. వెనక నుంచి మహేష్ సర్ టీమ్ ఆపేయమని చెప్తుంటే మహేష్ గారే పర్లేదు నువ్వు కంటిన్యూ చెయ్యి. ఏమేం చెయ్యాలనుకున్నావో చెయ్యి అన్నారు. నువ్వు గలగల భలే మాట్లాడతావు. బాగుంది అన్నారు. 20 నిముషాలు టైం ఇస్తే గంటన్నర సేపు సాగింది ఇంటర్వ్యూ.
ఆ తర్వాత మహేష్ గారికి నేను బాగా నచ్చి ఏదైనా యాంకరింగ్ ఉన్నా, టీవీ షోలు ఉన్నా నన్నే పిలిచేవారు. అయన సినిమా ప్రమోషన్స్ కి పిలిచారు. నేను ఉంటే ఆయన కంఫర్ట్ గా ఫీల్ అయి మాట్లాడతారు. ఓ సారి జీ వాళ్ళది రాజమండ్రిలో అవుట్ డోర్ ఈవెంట్ పెట్టారు. దానికి సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ గారు వస్తున్నారు. ఆ షో యాంకరింగ్ నాది కాదు. నేను అప్పటికే వేరే షో కమిట్ అయి ఉన్నాను. మహేష్ గారు నేను ఉంటే చేస్తాను, ప్రదీప్ ని తీసుకురండి అన్నారట. దాంతో ఛానల్ వాళ్ళతో మహేష్ గారి టీమ్ మాట్లాడి, నేను చేసే ఛానల్ తో మాట్లాడి ఒప్పించారు. నమ్రత గారు మహేష్ సర్ తో వెళ్లమన్నారు. నన్ను బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి మహేష్ గారు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్లారు. ఫ్లైట్ లో గంట సేపు ఆయనతో మాట్లాడుతూ సరదాగా వెళ్ళాము అని తెలిపాడు.
Also Read : Chiranjeevi – Sivaji : మెగాస్టార్ ని మెప్పించిన శివాజీ.. ‘మంగపతి’ని ఇంటికి పిలిచి.. ఫొటోలు వైరల్..
నేను హీరోగా అయ్యాక మొదటి సినిమా మొదటి సాంగ్ ఆయనతోనే రిలీజ్ చేయించాను. ఆయన అడగ్గానే ఒప్పుకున్నారు. నీలి నీలి ఆకాశం.. సాంగ్ పెద్ద హిట్ అవ్వడంతో మీవల్లే అని మహేష్ గారికి చెప్తే నాదేముంది సాంగ్ బాగుంది అన్నారు. సెంటిమెంట్ గా నా రెండో సినిమా మొదటి సాంగ్ కూడా ఆయనతోనే రిలీజ్ చేయించాను. ఈ సాంగ్ చూసి భలే పట్టుకొస్తావు పాటలు, నీకు ఎక్కడ దొరుకుతాయి అన్నారు అని మహేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు ప్రదీప్. దీంతో మహేష్ బాబుకి ప్రదీప్ అంటే ఎంత ఇష్టమో అని ప్రదీప్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.