Sowmya
Sowmya : కన్నడ యాంకర్, నటి సౌమ్య తెలుగులో కూడా పరిచయమే. ఇక్కడ కూడా పలు సీరియల్స్, టీవీ షోలతో, జబర్దస్త్ లో యాంకర్ గా మెప్పించింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య తన కష్టాలు చెప్పింది.
Also Read : Anchor Sowmya : యాక్సిడెంట్ అయినా, రక్తం కారుతున్నా యాంకరింగ్ చేయడానికి వెళ్లిన యాంకర్..
ఈ క్రమంలో సౌమ్య మాట్లాడుతూ.. మనకు కష్టాలు ఉన్నాయని ఎవరికీ చెప్పుకోకూడదు. అడ్వాంటేజ్ తీసుకుంటారు. ముఖ్యగా పని చేసే చోట. ఈమెకు జాబ్ అవసరం ఎలా అయినా ఉంటుందిలే అనుకుంటారు. నేను చదువుకునేటప్పుడు డబ్బుల కోసం పార్ట్ టైం చేశాను ఒక లాయర్ దగ్గర. వాళ్లింట్లోనే పని చేసే దాన్ని. ఆ లాయర్ నా మీద చేతులు వేసి, టైపింగ్ నేర్పిస్తా అంటూ నా మీదకు వచ్చి నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. వాళ్ళ వైఫ్, అమ్మ పక్కకి వెళ్తే చాలు నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. మనకు కష్టం ఉంది, పరిస్థితి బాలేదు అని తెలిస్తే మనతో ఆడుకుంటారు అని చెప్తూ ఎమోషనల్ అయింది.
Also Read : Sowmya : ఫ్లైట్ లో యాంకర్ ఫోన్ నెంబర్ అడిగిన పెద్ద హీరో.. ఆ మ్యాటర్ బయటపెట్టొద్దు అంటూ..