Anchor Sreemukhi : శ్రీముఖి ఇంట విషాదం..

యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం నెలకొంది.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిందామె..

Anchor Sreemukhi : శ్రీముఖి ఇంట విషాదం..

Anchor Sreemukhi

Updated On : September 15, 2021 / 5:58 PM IST

Anchor Sreemukhi: బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం నెలకొంది. సోమవారం శ్రీముఖి అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయింది శ్రీముఖి.

Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?

‘అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం.. జీవితంలో ఎన్నో విషయాలను తను నాకు చెప్పింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. అందరికీ హ్యాపీనెస్ పంచేది. చాలా ధైర్యవంతురాలు. అమ్మమ్మ.. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞతలు. ఎప్పటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ’ అంటూ అమ్మమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్రీముఖి.

Varalaxmi Sarathkumar : వైరల్ అవుతున్న వరలక్ష్మి పోస్ట్

శ్రీముఖి అమ్మమ్మ కన్నుమూశారనే వార్త తెలియగానే పలువురు టీవీ, సినీ పరిశ్రమల వారు ఫోన్ కాల్స్, మెసేజుల ద్వారా సంతాపం తెలుపుతున్నారు. శ్రీముఖి చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)