Andrea Jeremiah : సినిమా కోసం నగ్నంగా నటించిన హీరోయిన్.. కానీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
గత కొన్ని రోజులుగా పిశాచి 2 సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ మిష్కిన్ క్లారిటీ ఇచ్చారు. తాజా ప్రెస్ మీట్ లో మిష్కిన్ మాట్లాడుతూ.. ''పిశాచి 2 సినిమాలో ఆండ్రియా నిజంగానే నగ్నంగా నటించింది, అందుకు....................

Andrea Jeremiah act nude for Pisasu 2 Movie
Andrea Jeremiah : సింగర్ ఆండ్రియా జెర్మియా యుగానికి ఒక్కడు సినిమాతో ఆర్టిస్ట్ గా ఫేమ్ తెచ్చుకొని ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. తాజాగా ఆండ్రియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పిశాచి 2. గతంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా పిశాచికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని డైరెక్టర్ మిష్కిన్ తెరకెక్కించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. పిశాచి సినిమా ఆగస్ట్ 31న విడుదల కానుంది.
అయితే గత కొన్ని రోజులుగా పిశాచి 2 సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ మిష్కిన్ క్లారిటీ ఇచ్చారు. తాజా ప్రెస్ మీట్ లో మిష్కిన్ మాట్లాడుతూ.. ”పిశాచి 2 సినిమాలో ఆండ్రియా నిజంగానే నగ్నంగా నటించింది, అందుకు భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి సినిమాలో ఆ సన్నివేశాలు పెట్టలేదు. కేవలం ప్రమోషన్స్ కి, పోస్టర్స్ కి మాత్రమే ఆ సన్నివేశాలని వాడుకున్నాము. ఈ సన్నివేశాలు ఆండ్రియా సన్నిహితురాలు అయిన ఫోటోగ్రాఫర్ తోనే తీయించాము. ఆ సమయంలో ఎవరూ లేరు” అని తెలిపారు.