మలయాళంలో ‘అల వైకుంఠపురములో’ – ఫ్యాన్స్ హంగామా షురూ!

‘అల వైకుంఠపురములో’ మలయాళ వెర్షన్ ‘అంగ వైకుంఠపురత్తు’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘సామజనవరగమన’ మలయాళ సాంగ్‌ నవంబర్ 10న విడుదల..

  • Publish Date - November 7, 2019 / 07:25 AM IST

‘అల వైకుంఠపురములో’ మలయాళ వెర్షన్ ‘అంగ వైకుంఠపురత్తు’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘సామజనవరగమన’ మలయాళ సాంగ్‌ నవంబర్ 10న విడుదల..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల వైకుంఠపురములో’.. ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.. ఇప్పటికే 150 మిలియన్లకు పైగా వ్యూస్ (రెండు పాటలూ కలిపి) దాటడం విశేషం..

అల్లు అర్జున్‌కి మలయాళంలోనూ అభిమానులున్నారు.. తనని అక్కడ మల్లు అర్జున్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.. గతేడాది కేరళలో జరిగిన నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ప్రారంబోత్సవానికి అక్కడ ప్రభుత్వం బన్నీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి తన చేత జెండా ఆవిష్కరింప చేసింది అంటే మలయాళంలో మనోడికున్న క్రేజ్ చూడండి మరి.. బన్నీ సినిమాలకు మలయాళంలోనూ మంచి డిమాండ్ ఉంటుంది.. అల వైకుంఠపురములో చిత్రాన్ని మలయాళంలో విడుదల చేస్తున్నారు.. మలయాళ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నిర్మాతలు..

Read Also : మహేష్ మేనల్లుడు వస్తున్నాడోచ్!

‘అంగ వైకుంఠపురత్తు’ అనే పేరు ఫిక్స్ చేశారు.. బన్నీ లుక్ బాగుంది.. ‘సామజనవరగమన’ మలయాళ సాంగ్‌ను నవంబర్ 10న విడుదల చేయనున్నారు.. ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో లేదో కేరళలో బన్నీ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేసేశారు.. ఫస్ట్ లుక్ ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు.. త్వరలో మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.