పుకార్లు పుట్టిస్తున్నారు.. ‘ఆచార్య’పై ఆరోపణలు చేయలేదు.. 10TVతో అనిల్..

  • Published By: sekhar ,Published On : August 24, 2020 / 08:31 PM IST
పుకార్లు పుట్టిస్తున్నారు.. ‘ఆచార్య’పై ఆరోపణలు చేయలేదు.. 10TVతో అనిల్..

Updated On : August 24, 2020 / 8:51 PM IST

Director Anil Reacts on Acharya Movie copy allegations: మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత, దర్శకుడు.. ఇది నా కథే అంటూ ఆరోపణలు చేశారంటూ వార్తలు వచ్చాయి.
‘ఆచార్య’ టైటిల్ తర్వాత వచ్చే సన్నివేశం తను రాసుకున్న కథలోని సన్నివేశంలానే ఉందని అనిల్ ఆరోపించినట్లు కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి 10TV అనిల్‌ని సంప్రదించగా
తాను కాపీ ఆరోపణలు చేసినట్లు వస్తున్న వార్తలపై అనిల్ స్పందించారు.

‘‘నేను ఎటువంటి ఆరోపణలు చెయ్యలేదు.. కథ తెలియనపుడు ఎలా ఆరోపణలు చేస్తాను?.. మోషన్ పోస్టర్ చూసిన తర్వాత నా మిత్రులు పాయింట్ తీశారు.. నువ్వు అనుకున్న ధర్మస్థలి పాయింట్‌లా ఉందే అన్నారు. అంతే ఇక అప్పటినుంచి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అవన్నీ పుకార్లే కానీ నేను ఎటువంటి ఆరోపణలు చెయ్యలేదు’’.. అని తెలిపారు అనిల్.