Tripti Dimri : కాబోయే భర్తకు ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్పిన యానిమల్ నటి

యానిమల్ నటి త్రిప్తికి ఆ సినిమా తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ నటి తన పెళ్లి.. కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

Tripti Dimri

Tripti Dimri : యానిమల్ సినిమాతో నటి త్రిప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. తాజాగా ఈ నటి తన పెళ్లి గురించి, కాబోయే భర్తకు ఎలాంటి అర్హతలు ఉండాలి? అనే అంశాలపై ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

Brahmanandam : పుట్టిన రోజు వేళ.. బ్రహ్మానందం మొదటి తెలుగు – నేపాలీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

ఉత్తరాఖండ్‌లో పుట్టి పెరిగిన త్రిప్తి కొంతకాలం మోడల్‌గా పనిచేసారు. సంతూర్ మమ్మీగా కూడా పేరొచ్చింది. 2017 లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2018 లో లైలా మజ్ను, 2020 లో బుల్ బుల్ సినిమాలు బ్రేక్ ఇచ్చాయి. ఈ సినిమాలు అటుంచితే 2023 లో సందీప్ రెడ్డి వంగా మూవీ యానిమల్ సినిమాతో త్రిప్తి రేంజ్ పెరిగిపోయింది. ఇప్పటికే మేరే మహబూబ్ మేరే సనమ్ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న త్రిప్తికి తెలుగు, తమిళ భాషల్లో బడా బ్యానర్ల నుండి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

Ashish : ‘వాలెంటైన్ డే’ రోజు యువ హీరో పెళ్లి.. ఎక్కడో తెలుసా?.. దిల్ రాజు కోసం టాలీవుడ్ తరలివస్తుందా?

తాజాగా ఈ నటి తన పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతానికి త్రిప్తికి పెళ్లి చేసుకునే ఆలోచనే లేదట. అయితే కాబోయే భర్త మాత్రం ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉండాలట.. అంతేకాదు తనను అర్ధం చేసుకునే మంచి వ్యక్తి అయి ఉండాలని త్రిప్తి కోరుకుంటున్నారట. గతంలో త్రిప్తి నటి అనుష్క శర్మ బ్రదర్ కర్నేష్ శర్మతో డేటింగ్ చేసినట్లు వార్తలో వచ్చాయి. తనతో విడిపోయిన తర్వాత బిజినెస్ మేన్ సామ్ మర్చంట్‌తో డేటింగ్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. వీటిపై త్రిప్తి ఎప్పుడూ స్పందించలేదు. ప్రస్తుతం ఈ నటి కార్తీక్ ఆర్యన్‌తో ఆషికి 3 సైన్ చేసారు. తెలుగు, తమిళ ఆపర్లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.