Brahmanandam : పుట్టిన రోజు వేళ.. బ్రహ్మానందం మొదటి తెలుగు – నేపాలీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
బ్రహ్మానందం ఇప్పటికే పలు భాషల్లో నటించారు. ఇప్పుడు నేపాలీ భాషలో నటించబోతున్నారు. బ్రహ్మానందం నటిస్తున్న మొదటి తెలుగు - నేపాలీ సినిమా నుంచి నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Brahmanandam Acting in Telugu Nepali Movie Hrashwo Deergha First Look and Releasing Date Revealed
Brahmanandam : మనందరికీ ఇష్టమైన వ్యక్తి, కామెడీ కింగ్, ఎన్నో ఏళ్లుగా దాదాపు వెయ్యికి పైగా సినిమాలతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు బ్రహ్మానందంకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నేడు బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త సినిమాని ప్రకటించారు.
బ్రహ్మానందం ఇప్పటికే పలు భాషల్లో నటించారు. ఇప్పుడు నేపాలీ(Nepali) భాషలో నటించబోతున్నారు. బ్రహ్మానందం నటిస్తున్న మొదటి తెలుగు – నేపాలీ సినిమా నుంచి నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాగే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమాకు ‘హ్రశ్వ దీర్ఘ'(Hrashwo Deergha) అనే టైటిల్ ని ప్రకటించారు.
Also Read : Ashish : ‘వాలెంటైన్ డే’ రోజు యువ హీరో పెళ్లి.. ఎక్కడో తెలుసా?.. దిల్ రాజు కోసం టాలీవుడ్ తరలివస్తుందా?
హరిహర అధికరి, నీతా దుంగన మెయిన్ లీడ్స్ లో బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో నీతా ఫిలిం ప్రొడక్షన్స్ నిర్మాణంలో చంద్ర పంత్ దర్శకత్వంలో ఈ హ్రశ్వ దీర్ఘ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హ్రశ్వ దీర్ఘ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రికార్డులు, రివార్డులు సాధించిన బ్రహ్మానందం మొదటిసారి తెలుగు – నేపాలీ సినిమాలో నటిస్తూ మరో రికార్డ్ సొంతం చేసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, నేపాలీ భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో బ్రహ్మానందం నేపాలీ సినిమాలో కూడా నటిస్తున్నందుకు పలువురు అభినందిస్తున్నారు.
Happy Birthday #Brahmanandam Sir ?
NEW POSTER of upcoming New Nepali Movie: HRASHWO DEERGHA / ह्रस्व दीर्घ ?️IN CINEMAS : Asoj 11th, 2081/ 27th september 2024 all over the World ?️
Producer:#neetadhungana
Story:#hariharadhikari
Director:#chandrapant pic.twitter.com/hdXiGfhv4U— Movie Mania Nepal (@MovieManiaNepal) February 1, 2024