Ashish : ‘వాలెంటైన్ డే’ రోజు యువ హీరో పెళ్లి.. ఎక్కడో తెలుసా?.. దిల్ రాజు కోసం టాలీవుడ్ తరలివస్తుందా?

గత సంవత్సరం నవంబర్ లో అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ నిశ్చితార్థం జరిగింది.

Ashish : ‘వాలెంటైన్ డే’ రోజు యువ హీరో పెళ్లి.. ఎక్కడో తెలుసా?.. దిల్ రాజు కోసం టాలీవుడ్ తరలివస్తుందా?

Dil Raju Brother Sirish Son Young Hero Ashish Wedding Venue and Date Full Detials Here

Updated On : February 1, 2024 / 11:52 AM IST

Ashish Wedding : దిల్ రాజు(Dil Raju) సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలో దిల్ రాజుతో కలిసి పనిచేస్తున్నారు. శిరీష్ తనయుడు ఆశిష్(Ashish) రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో రాబోతున్నాడు. మరో సినిమా కూడా ప్రకటించాడు. అయితే ఈ యువ హీరో ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు.

గత సంవత్సరం నవంబర్ లో అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆశిష్ నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ కేవలం రెండు కుటుంబాల మధ్యే జరిగింది. ఇటీవలే దిల్ రాజు, ఫ్యామిలీ కలిసి ఆశిష్ పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులను స్వయంగా కలిసి పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు. ఆశిష్ – అద్విత రెడ్డి పెళ్లి ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే రోజు జైపూర్ లోని ఓ రాజమహల్ లో ఘనంగా జరగనుంది.

Also Read : Chiranjeevi : 68 ఏళ్ళ వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు.. ‘విశ్వంభర’ కోసం అంటూ..

ఈ పెళ్ళికి ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులందర్నీ పిలిచినట్టు సమాచారం. మరి పెళ్ళికి ఎవరెవరు వెళ్తారో చూడాలి. అయితే పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఫిబ్రవరి 23న గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి మాత్రం టాలీవుడ్ అంతా తరలి రానుంది.