బాలయ్య- బోయపాటి సినిమా యానిమేటెడ్ టీజర్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా టీజర్ ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సంధర్భంగా విడుదలైంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’.‘లెజెండ్’ సినిమాలు ఒకదాన్ని మించి మరోకటి సూపర్ హిట్ కాగా.. వీళ్ల కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే లేటెస్ట్‌గా మూడవ సినిమా(బిబి3) సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ‘మోనార్క్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ప్రచారం జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా యానిమేటెడ్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది.
ఎస్ఆర్ఏ1 ఎంటర్‌టైన్‌మెంట్ దీనిని రూపొందించగా, ఇది కూడా ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. అంతా సవ్యంగా ఉండి ఉంటే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేది. కానీ షూటింగ్‌కు మహమ్మారి వైరస్ ఆటంకం కలిగించింది. ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.