Beauty : డైరెక్ట‌ర్ మారుతి టీమ్ నుంచి మ‌రో బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ.. బ్యూటీ టీజ‌ర్ చూశారా?

అంకిత్ కొయ్య, నీలఖి జంట‌గా న‌టిస్తున్న బ్యూటీ టీజ‌ర్ వ‌చ్చేసింది.

Ankith Koyya Beauty Teaser out now

అంకిత్ కొయ్య, నీలఖి జంట‌గా న‌టిస్తున్న మూవీ బ్యూటీ. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. వానరా సెల్యులాయిడ్, మారుతి టీం ప్రొడక్ట్‌, జీ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి.ఎస్.రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వాలంటైన్స్ డే సంద‌ర్భంగా బ్యూటీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఓ అందమైన ప్రేమ కథతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ చూపించ‌బోతున్న‌ట్లుగా టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

Prabhas- Jr NTR : తమిళ డైరెక్టర్‌తో ప్రభాస్, ఎన్టీఆర్ మల్టీస్టారర్..!

https://youtu.be/gfb72W9xER0?si=bQdOOCGdEDeqPasb

ఓ స్కూటీ చుట్టూనే ఈ కథ తిరిగేలా ఉంది. స్కూటీ వచ్చాకా? ఏం జరుగుతుంది? హీరోయిన్ స్కూటీని ఎందుకు అడుగుతోంది..? ఆ స్కూటీ వచ్చాక క‌థానాయిక‌లో వచ్చే మార్పులు ఏంటి? ఈ ప్రేమ కథలో ఎలాంటి ట్విస్టులు వస్తాయి అని ప్ర‌శ్న‌లు రెకెత్తేలా టీజ‌ర్‌ను క‌ట్ చేశారు.

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్

న‌రేష్, వాసుకి, నంద‌గోపాల్‌, సోనియా చౌద‌రి, నితిన్ ప్ర‌స‌న్న‌, ముర‌ళీ గౌడ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా సాయి కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.