Kalki 2898 AD : కల్కిలో మలయాళం స్టార్ హీరోయిన్ అన్నా బెన్..
ఒక్కో సర్‌ప్రైజ్‌ను రివీల్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు.

Anna Ben first look from Kalki 2898 AD unveiled
Kalki 2898 AD – Anna Ben : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. బుధవారం ముంబై వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
కాగా.. కల్కి విడుదలకు ముందు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కో సర్‌ప్రైజ్‌ను రివీల్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. మొన్న అలనాటి నటి శోభన ఈ మూవీలో నటిస్తున్నట్లు చెప్పగా తాజాగా మలయాళ స్టార్ హీరోయిన్ అన్నా బెన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె కైరా పాత్రను పోషించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
Thaman : తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన తమన్..
దీపికా పదుకోన్ హీరోయిన్ నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కీలక పాత్రలను పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా వైజయంతీ మూవీస్ పతాకం పై అశ్విని దత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
No amount of darkness can Resist a smile ?
7 days to go for #Kalki2898AD.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #AnnaBen @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/KkVg0Llslk
— Kalki 2898 AD (@Kalki2898AD) June 20, 2024