Thaman : తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన తమన్..
ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్.

Father is an emotion Thaman
ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడో సీజన్ ప్రారంభమైంది. ఈ షోకి జడ్జ్‌లుగా ఎస్ఎస్ తమన్, కార్తిక్, గీతా మాధురిలు వ్యవహరిస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లాంఛింగ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరించాయి. దేశ, విదేశాల నుంచి పాల్గొన్న కంటెస్టెంల్స్ తమ గాత్రంతో మైమరిపోయేలా చేశారు.
కాగా.. షో మధ్యలో తమన్‌ను మీ జీవితంలో ఏడిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అని గీతా మాధురి అడిగింది. ఎన్నో సార్లు ఏడిచానని తమన్ చెప్పుకొచ్చాడు. తన ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్‌లోనే ఉంటుందన్నాడు. తరువాత తమన్ అమ్మగారి గురించి గీతామాధురి ప్రస్తావన తీసుకురాగా.. తండ్రిని, గతాన్ని, బాల్యాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. కాగా.. తన ఎమోషన్‌ను దాచుకునే ప్రయత్నం చేశారు.
Dev Gill : ‘మగధీర’ విలన్ దేవ్ హీరోగా పాన్ ఇండియా సినిమా.. ‘అహో విక్రమార్క’ టీజర్ రిలీజ్..
కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ అవుతోంది.