Ram Pothineni: క్రేజీ కాంబో.. బోయపాటితో రామ్ సినిమా!

నేను శైలజ సినిమా నుండి యంగ్ హీరో రూటు మార్చి కొత్త కొత్త కాంబినేషన్లో సినిమాలను ఒకే చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా లుక్ కూడా మార్చేసిన రామ్..

Ram Pothineni: క్రేజీ కాంబో.. బోయపాటితో రామ్ సినిమా!

Ram Pothineni

Updated On : August 30, 2021 / 8:07 PM IST

Ram Pothineni: నేను శైలజ సినిమా నుండి యంగ్ హీరో రూటు మార్చి కొత్త కొత్త కాంబినేషన్లో సినిమాలను ఒకే చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా లుక్ కూడా మార్చేసిన రామ్ రెడ్ సినిమాతో అదే జోష్ కంటిన్యూ చేశాడు. ఇక ఇప్పుడు ఊహించని విధంగా తమిళ స్టైలిష్ మాస్ దర్శకుడు లింగుస్వామితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. లింగుస్వామితో సినిమాతో టాలీవుడ్ లో రామ్ సినిమాలపై ఒక అటెన్షన్ క్రియేట్ కాగా.. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ కు సిద్దమైనట్లు తెలుస్తుంది.

మాస్ సినిమాలకు పేరు దర్శకుడు బోయపాటి శ్రీను. భద్రా నుండి ఇప్పుడు తెరకెక్కుతున్న అఖండ వరకు బోయపాటి అనగానే మనకి గుర్తొచ్చేది పక్కా ఊర మాస్ సినిమాలే. కాగా, ఇప్పుడు రామ్ బోయపాటితో కలిసి ఓ సినిమా చేయనున్నాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తి కాగా త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. బోయపాటి గత సినిమాల మాదిరే ఇది కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా తెలుస్తుంది.

ప్రస్తుతం బోయపాటి బాలయ్య అఖండ సినిమా పనుల్లో బిజీగా ఉండగా ఈ సినిమా అనంతరం రామ్ సినిమా పట్టాలెక్కనుందట. మిరియాల రవీందర్ రెడ్డి, చిట్టూరి శ్రీనులు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా కొసం స్టార్ హీరోయిన్ తో భారీ క్యాస్టింగ్ కూడా తీసుకోనున్నట్లు తెలుస్తుంది.