Bollywood : బాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ విడాకులు.. ఎవరో తెలుసా?
ఏ ఇండస్ట్రీ చూసినా విడాకుల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Bollywood
Bollywood : ప్రముఖ బాలీవుడ్ నటులు ధర్మేంద్ర-హేమ మాలినిల కుమార్తె, నటి ఈషా డియోల్ భర్త భరత్ నుండి విడాకులు తీసుకున్నారు. 12 సంవత్సరాల వైవాహిక జీవితానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.

Esha Deol
Family Star : ఫ్యామిలీ స్టార్ నుండి ‘నందనందనా’ లిరికల్ సాంగ్ రిలీజ్
ఈషా డియోల్ ధర్మేంద్ర, హేమమాలినిల కూతురు. 2012 లో బిజినెస్ మ్యాన్ భరత్ తఖ్తానిని పెళ్లాడారు. రాధ్య, మిరయా ఇద్దరు కూతుళ్లు. తాజాగా ఈషా, భరత్ 12 సంవత్సరాల తమ వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పారు. వీరి విడాకుల ప్రకటన బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు పుకార్లు వినపడ్డాయి. ఈషా పుట్టినరోజు వేడుకలో భరత్ కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత ఆద్యం పోసింది. గత నెలలో జరిగిన అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహ వేడుకలో ఈషా ఒంటరిగా కనిపించారు. భరత్ తన స్నేహితురాలితో బెంగళూరులో ఉంటున్నారంటూ రెడ్డిట్‌లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జంట ప్రకటనతో ఆ వార్తలు నిజం అయ్యాయి.
RC16 : చరణ్ సినిమాలో నటించే అవకాశం.. బుచ్చిబాబు స్పెషల్ వీడియో తప్పక చూడండి..
ఈషా-భరత్ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని.. పిల్లల విషయంలో తమ బాధ్యతలు నిర్వర్తిస్తామని .. తమ విడాకుల విషయంలో తమ ప్రైవసీని గౌరవించమని ఢిల్లీ టైమ్స్‌కి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 2002 లో ‘కోయి మేరే దిల్ సే పూచే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన ఈషా ధూమ్, నో ఎంట్రీ, దస్ వంటి సినిమాల్లో నటించారు. 2012 లో భరత్‌తో వివాహం జరిగిన తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘కేక్ వాక్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు.
View this post on Instagram