Rashmika : రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమాలో.. అను ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తుందా.. ఫోటో వైరల్
రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తుందా. ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఫోటో వైరల్ అవుతుంది.

anu emmanuel is in Rashmika Mandanna Rainbow movie photo gone viral
Rashmika Mandanna : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల బాలీవుడ్ కి కూడా వెళ్లి అక్కడ కూడా అదిరిపోయే హిట్స్ ని అందుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, రెండు తెలుగు లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక బాలీవుడ్ మూవీ, ఒక తమిళ సినిమా ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఒకటి ‘రెయిన్ బో’, రెండోది ‘ది గర్ల్ ఫ్రెండ్’. రెయిన్ బో చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో బై లింగువల్ సినిమాగా తెరకెక్కుతుంది.
ఆల్రెడీ పూజ కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ అయిన ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరిపేసుకుంటుంది. శాంతరూబన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీలో రష్మికతో పాటు మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ తన ఇన్‌స్టా స్టోరీలో రష్మికతో ఉన్న ఫోటో షేర్ చేశారు.
Also read : Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..
ఆ ఫొటోలో రష్మిక, అను కలర్స్ పూసుకొని కనిపిస్తున్నారు. ఇక ఈ పిక్ రెయిన్ బో షూటింగ్ సెట్స్ లోదే అయ్యుంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ ఫోటో రెయిన్ బో మూవీకి సంబంధించిందేనా అనేది తెలియాలంటే.. చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిందే. లవ్ డ్రామాతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు థియేటర్స్ లోకి తీసుకు రాబోతున్నారో అనేది తెలియాల్సి ఉంది.
ఇక మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ విషయానికి వస్తే.. టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈ మూవీలో మేల్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా లవ్ డ్రామాతోనే సాగుతుంది. మిగిలిన సినిమా విషయాలకు వస్తే.. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ‘పుష్ప 2’, ‘యానిమల్ 2’, బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో పీరియాడిక్ మూవీ, ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా.