Anurag Kashyap : నా స్వార్థం కోసం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయను..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ దీనిపై స్పందిస్తూ.. నేను సింపుల్ గా డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ సినిమాని ఓటీటీకి అమ్మితే సరిపోతుంది. కానీ నా సినిమాలో నటించిన నటీనటులు...............

Anurag Kashyap : నా స్వార్థం కోసం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయను..

Anurag Kashyap Comments on Movie Releases in OTT without theatrical release

Updated On : January 31, 2023 / 9:45 AM IST

Anurag Kashyap :  ఇటీవల కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్లు వాళ్ళు తీసిన సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని భావిస్తే ముందే ఓటీటీలకు అమ్మేస్తున్నారు. సినిమా తీసేసి ఓటీటీలకు అమ్ముకొని తక్కువ లాభాలైనా పర్లేదు నష్టం కంటే అనుకుంటున్నారు. దీంతో ఇటీవల ఓటీటీలో కూడా కొత్త కొత్త సినిమాలు డైరెక్ట్ గా చాలా వస్తున్నాయి. కానీ తాజాగా ఓ డైరెక్టర్ థియేటర్ కి తీసిన సినిమాని ఓటీటీకి అమ్మను అని అంటున్నాడు.

దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వస్పూర్, బాంబే టాకీస్, లస్ట్ స్టోరీస్.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన బాలీవుడ్ డైరెక్టర్, రచయిత అనురాగ్ కశ్యప్ తాజాగా ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చాయట. అయినా థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నాడు కశ్యప్.

Sunil Shetty : కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి ఎమోషనల్ పోస్ట్..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ దీనిపై స్పందిస్తూ.. నేను సింపుల్ గా డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ సినిమాని ఓటీటీకి అమ్మితే సరిపోతుంది. కానీ నా సినిమాలో నటించిన నటీనటులు నా సినిమా కోసం చాలా సమయం ఇచ్చారు. వాళ్ళ జీవితంలో కొన్ని సంవత్సరాలు నాకు ఇచ్చారు. అలాంటప్పుడు నా స్వార్థం కోసం ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయలేను. నా లాభం కోసం ఆర్టిస్టులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తెంచలేను, ఈ సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేస్తాను అని అన్నారు. ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది.