అమెరికాలో అనుష్క చెల్లి-సోషల్ మీడియాలో లొల్లి
అచ్చు అనుష్కలా ఉన్నఅమెరికన్ సింగర్.

అచ్చు అనుష్కలా ఉన్నఅమెరికన్ సింగర్.
బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మను నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. దానికి కారణం, అచ్చు అనుష్కలా ఉన్న అమ్మాయి ఫోటో నెటిజన్స్ కంట పడడమే.. అసలేం జరిగిందో కాస్త డీటేల్డ్‌గా తెలుసుకుందాం. అమెరికాకు చెందిన స్టార్ సింగర్ కమ్ రైటర్, జులియా మైకేల్స్ ఈ మధ్య తన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అనుష్క శర్మ పోలికలతో, అచ్చుగుద్దినట్టు ఆమెలానే ఉండడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోయారు.
వెంటనే జులియా గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి, అనుష్క పిక్, జులియా పిక్ పక్కపక్కన పెట్టి, ఆ ఫోటోకు అనుష్క శర్మని ట్యాగ్ చేసారు. ఇక అక్కడినుండి కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అనుష్క శర్మ అమెరికా వెళ్ళింది, వెస్ట్రన్ వెర్షన్ అనుష్క శర్మ, జులియా, అనుష్కలను పక్కపక్కన నిలబెడితే విరాట్ కూడా గుర్తుపట్టడం కష్టమే, అనుష్కా, అమెరికాలో నీకో చెల్లి కూడా ఉందా? అంటూ.. ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై అనుష్క శర్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.