Prabhas – Anushka : ప్రభాస్‌ని అనుష్క ఎలాంటి ముద్దు పేరుతో పిలుస్తుందో తెలుసా.. పోస్ట్ వైరల్!

ప్రభాస్ ప్రతి ఒకర్ని డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుస్తుంటాడు. మరి డార్లింగ్ ప్రభాస్ ని అనుష్క ఎలాంటి ముద్దు పేరుతో పిలుస్తుందో తెలుసా?

Prabhas – Anushka : ప్రభాస్‌ని అనుష్క ఎలాంటి ముద్దు పేరుతో పిలుస్తుందో తెలుసా.. పోస్ట్ వైరల్!

Anushka Shetty called Darling Prabhas as Pupsu nickname

Updated On : May 2, 2023 / 3:44 PM IST

Prabhas – Anushka : టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ (Prabhas), అనుష్క (Anushka Shetty) కాంబినేషన్ సూపర్ హిట్ మాత్రమే కాదు ఆడియన్స్ లో కూడా ఈ ఇద్దరి ఫ్రెండ్ షిప్ పై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వారి ఇద్దరి మధ్య ఉన్నదీ మంచి స్నేహం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆడియన్స్ మాత్రం వారిద్దరూ పెళ్లి చేసుకొంటే బాగుండు అని ఆశ పడుతుంటారు.

Miss Shetty Mr Polishetty : అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా.. టీజర్ వచ్చేసింది!

కాగా ప్రభాస్ అందర్నీ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటాడని అందరికి తెలిసిందే. దీంతో తనని కూడా అందరు డార్లింగ్ ప్రభాస్ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. అయితే అనుష్క, ప్రభాస్ ని ఏ ముద్దు పేరుతో పిలుస్తుందో తెలుసా?? అనుష్క, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కలిసి నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూసిన ప్రభాస్ మూవీ టీంని కంగ్రాట్యులేట్ చేస్తూ పోస్ట్ వేశాడు. దీనికి అనుష్క రెస్పాండ్ అవుతూ.. “Thank you Pupsuu” అంటూ కామెంట్ చేసింది.

Prabhas Pawan Kalyan : అత్తిలిలో దారుణం.. ప్రభాస్ అభిమాని చేతిలో పవన్ కల్యాణ్ అభిమాని హతం

ఇక ఇది చూసిన అభిమానులు అనుష్క, ప్రభాస్ ని ‘పుప్సు’ అని ముద్దుగా పిలుస్తుంది అనుకుంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విషయానికి వస్తే.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా, నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా నటిస్తున్నారు. పి మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.