ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు..అనుష్క

బెంగుళూరులో స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సూపర్’సినిమా ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన సినిమాల ద్వారా తెలుగు చిత్రరంగంలో స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకు వెళ్లి నెంబర్ వన్ పొజీషన్ చేరుకుంది.
Read Also: మజిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా అనుష్క తొలి రోజులని గుర్తు చేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నాకు నేనుగా సినిమాలలోకి రాలేదు. పూరీ జగన్నాథ్ గారు సూపర్ సినిమాలో హీరోయిన్ కోసం చూస్తుంటే ఆయనకి తెలిసిన ఫ్రెండ్ నా గురించి చెప్పారు. అప్పుడు పూరీ సర్ ఓకే అనడంతో హైదరాబాద్‌కి వచ్చాను. అలా తొలి అవకాశం నాకు వచ్చిందని అనుష్క అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఆమె కెమెరాని ఫేస్ చేసి నిన్నటితో 14 సంవత్సరాలు కావడంతో ఆ ఇంటర్వ్యూ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. నా కోసం ప్రత్యేక సమయం కేటాయించి నన్ను ఈ స్థానంలో నిలిపిన వారికి, నాగార్జున గారికి, పూరీ జగన్నాథ్ గారికి నా అభిమానులు, స్నేహితులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొంది అనుష్క.
Read Also: గుంటూరు జిల్లాలో 14సీట్లు ఖరారు: నారా లోకేష్ ఎంట్రీ.. రసవత్తరంగా రాజకీయం